AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

11th Hour web series: మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఉగాది కానుకగా ‘లెవన్త్ అవర్’.. ఎందులో అంటే..?

తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఆహా ప్రేక్ష‌కుల కోసం తెలుగు సంవ‌త్స‌రాది వేడుక‌ల‌ను ముందుగానే అందించ‌డానికి సిద్ధ‌మైంది.

11th Hour web series: మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఉగాది కానుకగా ‘లెవన్త్ అవర్’.. ఎందులో అంటే..?
Tamannaah
Rajeev Rayala
|

Updated on: Mar 25, 2021 | 12:59 PM

Share

’11th Hour’ Telugu web series : తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తోన్న తెలుగు ఓటీటీ ఆహా ప్రేక్ష‌కుల కోసం తెలుగు సంవ‌త్స‌రాది వేడుక‌ల‌ను ముందుగానే అందించ‌డానికి సిద్ధ‌మైంది. అందులో భాగంగా ఏప్రిల్ 9న ఆహాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా తొలిసారి న‌టించిన ఒరిజిన‌ల్ ‘లెవన్త్ అవర్’ ప్ర‌సారం కానుంది.స‌మంత‌తో ‘సామ్‌జామ్’‌, రానా ద‌గ్గుబాటితో ‘నెం.1 యారి’ వంటి టాక్ షోస్‌తోపాటు ర‌వితేజ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘క్రాక్’‌, అల్ల‌రి నరేష్ ‘నాంది’ వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌తో తెలుగు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ఆహా ఇప్పుడు త‌మ‌న్నా‘లెవన్త్ అవర్’ ఒరిజిన‌ల్‌ను ప్రేక్షకుల ముందుకు రానుంది.

పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేదే ప్ర‌ధానాంశమ‌ని త‌మ‌న్నా తెలిపారు. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళ‌వింపుగా ఈ ‘లెవన్త్ అవర్’ 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రూపొందింది.  ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 9న ప్ర‌సారం కానున్న ఈ వెబ్ సిరీస్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌సార‌మైన‌ తెలుగు వెబ్ సిరీస్‌లో అతి పెద్ద వెబ్ సిరీస్‌. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి ఈ సిరీస్‌కు రైట‌ర్‌గా వ్యవహరించగా .. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఇదిలా ఉంటే త్వరలో ఆహాలో జాంబి రెడ్డి, అర్థ శ‌తాబ్దం వంటి ఆస‌క్తిక‌ర‌మైన సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. క్లాసిక్ చిత్రాలు, ఒరిజిన‌ల్స్‌తో ఆహా అతి త‌క్కువ వ్య‌వ‌థిలోనే తెలుగు వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని టాలీవుడ్ లో ఎంట్రీ.. చిరంజీవిని కలిశా… అయితే..!

లవ్ స్టోరీ నుంచి మరో అందమైన పాటను రిలీజ్ చేసిన మహేష్.. వానలో తడుస్తూ డ్యాన్స్ చేసిన చైతు, సాయి పల్లవి