లవ్ స్టోరీ నుంచి మరో అందమైన పాటను రిలీజ్ చేసిన మహేష్.. వానలో తడుస్తూ డ్యాన్స్ చేసిన చైతు, సాయి పల్లవి

టాలీవుడ్ లో ప్రేమకథలు తెరకెక్కించడంలో దిట్టగా పేరుతెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా 'లవ్ స్టోరీ' అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా

లవ్ స్టోరీ నుంచి మరో అందమైన పాటను రిలీజ్ చేసిన మహేష్.. వానలో తడుస్తూ డ్యాన్స్ చేసిన చైతు, సాయి పల్లవి
Love Story
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 25, 2021 | 12:40 PM

love story movie : టాలీవుడ్ లో ప్రేమకథలు తెరకెక్కించడంలో దిట్టగా పేరుతెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో చైతన్య , సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఇక ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి విడుదలైన అన్ని పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన సారంగదరియా సాంగ్ ట్రేండింగ్ లోకొనసాగుతుంది.తాజాగా ఈ సినిమానుంచి మరో అందమైన పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ‘ఏవో ఏవో కలలే.. ఎన్నో ఎన్నో తెరలే.. అన్నీ దాటి మనసే.. ఎగిరిందే.. నన్నే నేను గెలిచే.. క్షణాలివే కనుకే..’ అంటూ సాగిన ఈ పాట రిలీజ్ చేస్తూ  చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపాడు సూపర్ స్టార్. జోనితా గాంధీ – నకుల్ అభ్యంకార్ కలిసి ఆలపించారు. ఈ వాన పాటలో సాయి పల్లవి – చైతూ డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. ఇక లవ్ స్టోరీ సినిమాను  ఏప్రిల్ 16న  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Republic Movie First Look: ’74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బతుకున్నాం’ అంటోన్న మెగా హీరో.. ఆసక్తిగా రిపబ్లిక్‌..