AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి 235 కోట్ల లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి.

OTT Movie: ఓటీటీలోకి 235 కోట్ల లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: May 26, 2025 | 12:36 PM

Share

భైరవం లాంటి ఆసక్తికర సినిమాలు ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. అలాగే ఓటీటీలో కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా సందడి చేయనున్నాయి. ఇందులో లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఉంది. మేడే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా మొదట మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. కానీ క్రమ క్రమంగా టాక్ మారిపోయింది. వసూళ్లు కూడా పెరిగాయి. దీంతో ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 235 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. హీరో, హీరోయిన్ల అభినయం, అబ్బుర పరిచే యాక్షన్ సీక్వెన్సులు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. అలాగే అంతర్లీనంగా ప్రేమ కథ కూడా ఉండడంతో మూవీ లవర్స్ కు ఈ చిత్రం బాగా నచ్చేసింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మే 31 నుంచి ఈ యాక్షన్ థ్రిల్లర్ ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

ఇలా శనివారం ఓటీటీలోకి వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మరేదో కాదు సూర్య నటించిన రెట్రో. కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. జోజు జార్జ్, ప్రకాష్ రాజ్, నాజర్, జయరాం, సుజిత్ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్స్, స్టోన్‍బీచ్ ఫిల్మ్స్ బ్యానర్ల పై సూర్య, జ్యోతిక, కార్తికేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణణ్ సంగీతం అందించారు. 1990ల బ్యాక్‍డ్రాప్‍ లో రొమాంటిక్ యాక్షన్ మూవీగా రెట్రో ను తెరకెక్కించారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్ సినిమాలు, అలాగే సూర్య మూవీస్ ను ఇష్టపడే వారు రెట్రోపై ఒక లుక్కేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మే 31 నుంచి రెట్రో స్ట్రీమింగ్..

రెట్రో సినిమాలో సూర్య, పూజ..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..