AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అఫీషియల్.. ఓటీటీలో 235 కోట్ల సస్పెన్స్ థ్రిల్లర్.. దృశ్యంను మించిన ట్విస్టులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 235 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.ఈ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలో చూడాలని చాలా మంది ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు తెరపడింది.

OTT Movie: అఫీషియల్.. ఓటీటీలో 235 కోట్ల సస్పెన్స్ థ్రిల్లర్.. దృశ్యంను మించిన ట్విస్టులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
OTT Movie
Basha Shek
|

Updated on: May 27, 2025 | 10:58 AM

Share

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో పలు కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీ ఆడియెన్స్ కు అయితే ఈ వారం పండగే ఎందుకంటే నాని హిట్ 3, సూర్య రెట్రో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయనున్నాయి. అలాగే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే ఇప్పుడీ లిస్టులో మరో బ్లాక్ బస్టర్ మూవీ చేరింది. ఏప్రిల్ 25 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా కేరళలో రూ.100 కోట్లు వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ.235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది . ఇది మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా రికార్డుల కెక్కింది. ఇందులోని సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులను చూసి ఇది మరో దృశ్యం అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇలా థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. వాస్తవానికి మే మూడవ వారంలోనే ఈ మూవీ ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయిత థియేటర్లలో బాగానే వసూళ్లు సాధిస్తుండటంతో ఓటీటీ సంస్థ దానిని ఒక వారం ముందుకు వాయిదా వేసింది. అంటే మే30న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రానుంది. దీనిపై తాజా అధికారిక ప్రకటన వెలువడింది.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు తుడరుమ్. మలయాళ సూపర్ స్టార్ మోహనల్ లాల్ ఇందులో హీరోగా నటించాడు. అలనాటి అందాల తార శోభన మరో కీలక పాత్రలో యాక్ట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 30 నుంచి తుడరుమ్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు జియో హాట్ స్టార్ వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే సినిమాకు సంబంధించి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు