AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaar Season 5 OTT: సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ 5 గ్లింప్స్ చూశారా? ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ యాంకర్ సుడిగాలి సుధీర్ మరోసారి మన ముందుకు రానున్నాడు. అతను హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సర్కార్ సీజన్ ఐదో సీజన్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. తాజాగా కొత్త సీజన్ కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు.

Sarkaar Season 5 OTT: సుడిగాలి సుధీర్ సర్కార్ సీజన్ 5 గ్లింప్స్ చూశారా? ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే
Aha Sarkaar Season 5
Basha Shek
|

Updated on: Jun 02, 2025 | 12:40 PM

Share

ఓటీటీ ఆడియెన్స్ ను బాగా అలరించిన ప్రోగ్రామ్స్ లో సర్కార్ సీజన్ ఒకటి. బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలతో క్విజ్ లాంటి గేమ్ కాన్సెప్ట్ సాగే ఈ షో ఓటీటీ ఆడియెన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేసింది. ఆహా వీడియో ఓటీటీలో వచ్చిన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఐదో సీజన్ కు రంగం సిద్ధమైంది. కాగా సర్కార్ తొలి మూడు సీజన్లకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా వ్యవహరించాడు. గత నాలుగో సీజన్ నుంచి సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో సహజంగానే ఈ ప్రోగ్రామ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లిపోయింది. ‘ఈసారి అంతకు మించి’ అనేలా ఇప్పుడు సర్కార్ ఐదో సీజన్ రాబోతోంది. ఈసారి కూడా సుడిగాలి సుధీర్ హోస్ట్ చేయనున్నాడు. గురువారం (మే 29) సర్కార్ కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇందులో సుధీర్ రామ్ చరణ్ పెద్ది తరహాలో తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు.

‘ఒకటే ఆట ఆడైనాకి.. ఏదోలాగా గెలిచేదానికి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ స్టేజీ మీదున్నప్పుడే చేసేయాలా.. ఆడతామా ఏంటీ మళ్లీ.. సర్కార్ సీజన్ 5.. ఇక్కడ ఆడేది గెలవనీకె కాదు.. నువ్వేందో అందరికీ తెలవనీకే’ అంటూ సుడిగాలి సుధీర్ సర్కార్ కొత్త సీజన్ గురించి చెప్పేశాడు. కాగా జూన్ 6న సాయంత్రం 7 గంటల నుంచి ఐదో సీజన్ తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో ఓటీటీ అధికారికంగా వెల్లడించింది. అలాగే ప్రతి శుక్రవారం కొత్త ఎపిసోడ్ రానుంది. మరి గత సీజన్ లాగే ఈసారి కూడా సుధీర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మెప్పిస్తాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

జూన్ 6 న ఫస్ట్ ఎపిసోడ్

ఆహా సర్కార్ సీజన్ 5 గ్లింప్స్..

ఇవి కూడా చదవండి..

OTT Movie: పౌర్ణమి రోజున రెచ్చిపోయే రక్త పిశాచి.. ఓటీటీలో ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్.. చిన్న పిల్లలు చూడొద్దు

Tollywood: 17 ఏళ్లకే సినిమాల్లోకి.. బిగ్ బాస్‌తో ఎనలేని క్రేజ్.. ఈ విజయవాడ బ్యూటీని గుర్తు పట్టారా?

Tollywood: ఏంటమ్మా ఇది! వోడ్కాకు బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. నెటిజన్ల ఆగ్రహం

Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..