Hari Hara Veera Mallu: పవన్ హరి హర వీరమల్లులో మెరిసిన టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్.. ఎవరో గుర్తు పట్టారా?
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం హరి హర వీరమల్లు. తాజాగా ఈ మూవీ నుంచి నాలుగో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సాంగ్ లో ఒక టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మెరిశాడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది.అలాగే విలన్ గా బాబీ డియోల్ కనిపించనున్నాడు. వీరితో పాటు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ చిత్రం జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. తాజాగా ఈ పీరియాడికల్ మూవీ నుంచి ‘తార తార’ అని లిరిక్స్ తో సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. ఇందులో పవన్, నిధిల స్టెప్పులు అభిమానలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ సాంగ్ మేకింగ్ వీడియోలో టాలీవుడ్ కు చెందిన ఒక క్రేజీ డైరెక్టర్ అనూహ్యంగా మెరిశాడు. అయితే ఈ డైరెక్టర్ నటుడిగా మెరవడం ఇదేమీ మొదటి సారి కాదు. ఆ మధ్యన ప్రభాస్ నటించిన కల్కి సినిమా, అలాగే ఇటీవల రిలీజైన మ్యాడ్ 2 మూవీలోనూ క్యామియో రోల్స్ లో కనిపించాడు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ ` హరి హర వీరమల్లు` సినిమాలోనూ మెరిశాడు.
పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన వీర మల్లు సినిమాలో ఈ డైరెక్టర్ గెటప్ కూడా విచిత్రంగా ఉంది. బాగా ఫోకస్ చేసి చూస్తే తప్ప అతనిని గుర్తు పట్టలేం. మరి మీరు గుర్తు పట్టారా? అతనెవరో కాదు జాతి రత్నాలు సినిమా డైరెక్టర్ అను దీప్. మరి ఈ ఒక్కపాటలోనే అతను మెరిశాడా? లేదా? సినిమాలో మరిన్ని సీన్లలో కనిపిస్తాడా? అన్నది వీర మల్లు రిలీజయ్యాక కానీ క్లారిటీ రాదు.
హరి హర వీరమల్లు సినిమా మేకింగ్ వీడియోలో డైరెక్టర్ అనుదీప్.. వీడియో
Naku matramae naa? Meekunkuda anipisthondhaa ???
Ikkadunnadi Jathi Ratnalu director Anudeep K V naa?#HariHaraVeeraMallu 🦅 🎯 🔥 Powerstar #PawanKalyan garu 🤙🏻 #NidhiAgerwal pic.twitter.com/tbgldoUpYq
— 𝔸𝕔𝕥𝕦𝕒𝕝ℙ𝕦𝕝𝕤𝕖🦅 (@ActualPulse) May 28, 2025
మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు హరి హర వీరమల్లు సినిమాను నిర్మించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ సినిమాకు స్వరాలందించారు.
The heat has landed! 🔥 Volume max…vibe max! 🔊#TaaraTaara – The sizzling single from #HariHaraVeeraMallu is out now! 🔊💃
A @mmkeeravaani Musical 🥁🎻🎹 ✍️ @SriharshaEmani #AbbasTyrewala @pavijaypoet @Aazad_Varadaraj #MankombuGopalakrishnan 🎙️… pic.twitter.com/LnqH95UMLf
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 28, 2025
హరి హర వీరమల్లు సాంగ్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








