Gaddar Telangana Film Awards 2024: గద్దర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఆహా ఓటీటీ మూవీస్..
తెలంగాణ ప్రభుత్వం తెలుగు సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభను గుర్తించి గద్దర్ అవార్డులతో సత్కరిస్తుంది. దివంగత ప్రజాకవి, ఉద్యమ నాయకుడు గద్దర్ పేరుమీద ఏర్పాటు చేసిన ఈ అవార్డ్స్ ను అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సినిమా పురస్కారాలను అందివ్వనుంది. జూన్ 14న హైదరాబాద్ హైటెక్స్‌లో 2024 గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం జరగనుంది. జూన్ 14, 2025న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఈ అవార్డ్స్ అందజేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో ఆహా ఓటీటీ మూవీస్ సత్తా చాటాయి. పలు మేజర్ కేటగిరీల్లో ఆహా మూవీస్ అవార్డ్స్ గెల్చుకున్నాయి. సెకండ్ బెస్ట్ ఫిలింగా పొట్టేల్, బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా 35 ఇది చిన్న కథ కాదు అవార్డ్స్ దక్కించుకున్నాయి. 35 ఇది చిన్న కథ కాదు మూవీలో నటనకు నివేదా థామస్ కు బెస్ట్ హీరోయిన్ గా, అంబాజీపేట మ్యారేజి బ్యాండు చిత్రంలో నటనకు ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్, రజాకార్ మూవీకి మంచి సంగీతాన్ని అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్స్ గెల్చుకున్నారు.
ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన
35 ఇది చిన్న కథ కాదులో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, మెర్సీ కిల్లింగ్ లో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా గద్దర్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. రాజు యాదవ్ సినిమాకు బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్, రజాకార్ మూవీకి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గద్దర్ అవార్డ్స్ దక్కించుకున్నారు. పొట్టేల్ మూవీలో నటనకు అనన్య నాగళ్ల, రాజు యాదవ్ మూవీకి నిర్మాతలుగా ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ గెల్చుకున్నారు.
ఇది కూడా చదవండి : ఆ స్టార్ హీరో సినిమావల్ల నెగిటివ్ అయ్యా..! ఇంకోసారి ఆ పని చేయను.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలకు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డ్స్ దక్కడంపై ఆహా టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆహా ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్లు, షోలను అందించడంతో పాటు, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని సాంస్కృతిక వైభవాన్ని చాటే కంటెంట్ ని అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆహా టీమ్ తెలిపింది.
ఇది కూడా చదవండి : పెళ్ళైన స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. ఆతర్వాత మరో ఇద్దరు హీరోలతోనూ.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








