Gamanam: ఓటీటీలో అలరించనున్న గమనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

శ్రియా సరన్.. శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్.. నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గమనం.

Gamanam: ఓటీటీలో అలరించనున్న గమనం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Gamanam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 28, 2022 | 6:53 PM

శ్రియా సరన్ (Shriya Saran) . శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్.. నిత్యామీనన్ (Nitya Menon) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గమనం (Gamanam). ఈ సినిమాకు డైరెక్టర్ సంజనా రావు (Sanjana Rao) దర్శకత్వం వహించగా.. క్రియ ఫిల్మ్ కార్ప్, కలి ప్రొడక్షన్ బ్యానర్లపై రమేష్ కురుటూర, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్, వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాను వాస్తవిక సంఘటనల ఆధారంగా మూడు భావోద్వేగభరితమైన కథలతో తెరకెక్కించారు.  గత నెల (డిసెంబర్ 10న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ఇందులో శ్రియా, నిత్యామీనన్, శివ, ప్రియాంక నటనకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 28 అంటే ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో నటించగా.. నిత్యామీనన్ అతిథి పాత్రలో కనిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందిచారు. పాన్ ఇండియా లెవల్లో రూపొందించిన ఈ సినిమాను ముందుగా తెలుగులో విడుదల చేశారు. త్వరలోనే హిందీ, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు.

Also Read: Sweta Varma: బుల్లెట్ బండిని కొన్న బిగ్ బాస్ బ్యూటీ.. రైడ్ కు వెళ్లే టైమొచ్చిందంటూ..

Anupama parameswaran: క్యూట్ ఎక్స్‌ప్రెషన్లు తో క్యూట్ స్మైల్ తో ఎట్రాక్ట్ చేస్తున్న అనుపమ..

Himaja: విడాకుల వదంతులపై స్పందించిన హిమజ.. ఇన్ స్టా వీడియోలో ఏం చెప్పిందంటే..

Teaser Talk: రాక్ష‌సుడిని చంపడానికి దేవుడు కూడా అవ‌తారాలెత్తాలి.. ఆస‌క్తిక‌రంగా భళా తందనాన టీజ‌ర్‌..