AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eagle OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ఈగల్’.. రవితేజ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..

ఇటీవలే 'ఈగల్' సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్, సాంగ్స్‏తోనే విడుదలకు ముందే సినిమాపై అంచనాలను కలిగించారు మేకర్స్. అంతేకాకుండా ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

Eagle OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'ఈగల్'.. రవితేజ సినిమా ఎక్కడ చూడొచ్చంటే..
Ravi Teja Movie Eagle
Rajitha Chanti
|

Updated on: Mar 01, 2024 | 8:21 AM

Share

మాస్ మాహారాజా రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస మూవీస్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇటీవలే ‘ఈగల్’ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్, సాంగ్స్‏తోనే విడుదలకు ముందే సినిమాపై అంచనాలను కలిగించారు మేకర్స్. అంతేకాకుండా ఇందులో రవితేజ సరికొత్త పాత్రలో కనిపించడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఫిబ్రవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమాకు మొదటి రోజే సూపర్ హిట్ టాక్ వచ్చింది. చిన్న కంటెంట్.. కానీ రవితేజతో కలిసి కార్తీక్ తెరకెక్కించిన విధానంపై ప్రశంసలు కురిపించారు. అడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఈగల్ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా ? అని ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే చూసేయ్యోచ్చు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించగా.. దేవంజ్డ్ సంగీతం అందించారు.

ఈగల్ కథ విషయానికి వస్తే..

జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన చిన్న ఆర్టికల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. చిన్న కథనమే అయినా దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తుంది. ఈగల్ నెట్ వర్క్ కు సంబంధించిన అంశాన్ని నళిని కథనంగా రాయడంతో ఆమె పనిచేసే సంస్థపై దాడి జరుగుతుంది. దీంతో ఆమె ఉద్యోగం పోతుంది. ఈగల్ నెట్ వర్క్.. దేశంలోని ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్స్, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు టార్గెట్ గా ఉంటుంది. ఈ నెట్ వర్క్ మొత్తాన్ని సహదేవ్ వర్మ (రవితేజ) నడుపుతుంటాడు. ఈ నెట్ వర్క్ గురించి తెలుసుకోవడానికి అనుపమ చిత్తూరులోని తలకోన అడవులకు బయలుదేరుతుంది. అక్కడుండే ప్రజలను అడుగుతూ.. సహదేవ్ వర్మ గురించి తెలుసుకుంటుంది. అతని గతమేంటీ ?.. అతడి కోసం ప్రపంచదేశాలు ఎందుకు వెతుకుతున్నాయనే విషయాలన్నింటిని ఒక్కొక్కటిగా తెలుసుకుంటుంది. అసలు సహదేవ్ వర్మ ఎవరు ?.. ఈగల్ కు.. ఆయనకు ఉన్న లింక్ ఏంటీ ?..తెలుసుకోవాలంటే ఈగల్ సినిమా చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.