Tollywood: ఓటీటీలోకి మాస్ మహరాజ్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. స్ట్రీమింగ్ ఎప్పుటినుంచి అంటే..?
మాస్ మహరాజ్ రవితేజ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఓటీటీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మాస్ మహరాజ్ రవితేజ(Hero Ravi Teja) స్వశక్తితో కష్టపడి స్టార్‌గా ఎదిగిన వ్యక్తి. ఎటువంటి బ్యాగ్రౌంట్ లేకుండా ఇండస్ట్రీకి రావాలనుకునేవారు చిరంజీవి(Chiranjeevi) తర్వాత ఆదర్శంగా తీసుకునేది రవితేజనే. రవితేజ ఎనర్జీ వేరు. ఆయన స్క్రీన్ మీద కనబడితే ఆ కిక్ వేరు. సినిమా ఫ్లాప్ అయినా సరే.. తాను కనిపించిన ప్రతి సీన్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రయత్నిస్తాడు మాస్ మహరాజ్. కాగా జులై 29న ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీతో థియేటర్లలోకి వచ్చారు. కానీ అనుకున్నంతగా ఆడలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఈ మూవీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ మూవీలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించింది. శరత్ మండవ(Sarath Mandava) డైరెక్ట్ చేశారు. హీరో వేణు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ… మలయాళ లాంగ్వెజస్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. సో.. థియేటర్‌లో మిస్సైన ఫ్యాన్స్.. ఓటీటీలో మాస్ మహరాజ్ హై ఓల్టేజ్ యాక్షన్ చూసేందుకు రెడీ అవ్వండి.
View this post on Instagram