AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bachelor Party OTT: ఓటీటీలో రక్షిత్ శెట్టి సూపర్ హిట్ సినిమా.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

చార్లీ 777, సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, బి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువై పోయాడు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రక్షిత్ సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రక్షిత్ సినిమా వచ్చిందంటే సమ్‌థింగ్ డిఫరెంట్ ఏదో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు తెలుగు ప్రేక్షకులు.

Bachelor Party OTT: ఓటీటీలో రక్షిత్ శెట్టి సూపర్ హిట్ సినిమా.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Rakshit Shetty
Basha Shek
|

Updated on: Mar 03, 2024 | 7:51 PM

Share

చార్లీ 777, సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, బి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువై పోయాడు కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ రక్షిత్ సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో రక్షిత్ సినిమా వచ్చిందంటే సమ్‌థింగ్ డిఫరెంట్ ఏదో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు అలాంటి వారి కోసం రక్షిత్ శెట్టి మరో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే ఇందులో రక్షిత్ హీరో కాదు. ప్రొడ్యూసర్. అతను నిర్మించిన కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 26న కన్నడ నాట రిలీజైంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెడన్ గా ఓటీటీలోకి వస్తోంది. కేవలం ఒక్క రోజు ముందే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడయో బ్యాచిలర్ పార్టీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 4 అంటే సోమవారం నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు అధికారికంగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? లేదా తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

అభిజిత్ మహేష్ తెరకెక్కించిన బ్యాచిలర్ పార్టీ సినిమాను. పరమ్ వహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి, జీఎస్ గుప్తా సంయుక్తంగా నిర్మించారు. దిగంత్, అచ్యుత్ కుమార్, యోగేష్, సిరి రవికుమార్, బాలాజీ మనోహర్, ప్రకాష్ తుమినాడ్, పవన్ కుమార్, శోభరాజ్, సుధ బెల్వాడీ తదితరులు నటించారు. అర్జున్ రాము స్వరాలు సమకూర్చారు. భిజిత్ మహేష్, వీరేష్ శివమూర్తి, గణేష్ వశిష్ట మాటలు అందించగా, అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే..
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది!
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయిందా? ఇలా చేయండి!
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ లుక్ వైరల్
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. లోన్‌ ఎవరు తీర్చాలి?
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన RBI
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..