Ooru Peru Bhairavakona OTT : ఓటీటీలోకి ఊరుపేరు భైరవకోన.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే
తాజాగా ఊరుపేరు భైరవ కోసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. పాజిటివ్ మౌత్ టాక్‍తో ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటించారు.
సందీప్ కిషన్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా సందీప్ కిషన్ హిట్ లేక సతమతం అవుతున్నాడు. చేసిన సినిమాలన్ని వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. ఇటీవలే ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలోనూ కీలక పాత్రలో నటించాడు. కానీ ఈ సినిమాకూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాగా తాజాగా ఊరుపేరు భైరవ కోసం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. పాజిటివ్ మౌత్ టాక్‍తో ఈ సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడీగా కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటించారు.
హరర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నిజమేనే చెబుతున్న అనే సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పాట వినిపిస్తుంది. ఇక ఊరుపేరు భైరవ కోన సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబందించిన ఓ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
ఊరుపేరు భైరవ కోన సినిమా మార్చ్ 15న ఓటీటీలో రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను మంచి ఫ్యాన్సీ రేటుకు సోయాన్తం చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. మరో ఓటీటీ సంస్థ ఆహాలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ రెండు ఓటీటీలో దేనిలో ఊరుపేరు భైరవ కోన సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి. ఊరుపేరు భైరవ కోన సినిమాను ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
సందీప్ కిషన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి