Save The Tigers 2 OTT: కడుపుబ్బా నవ్వుకోడానికి రెడీనా! సేవ్ ది టైగర్స్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
భార్యల చేతిల్లో నలిగిపోతున్న భర్తల బాధలకు హాస్యాన్ని జోడించి సేవ్ ది టైగర్స్ సిరీస్ ను రూపొందించారు.ఇప్పుడీ సూపర్ హిట్ సిరీస్ కు సీక్వెల్ కూడా వస్తోంది. తాజాగా 'టైగర్స్ ఈజ్ బ్యాక్' అంటూ సేవ్ ది టైగర్స్ రెండో సీజన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్ కు మించి ఈసారి మరిన్ని ట్విస్టులు, నవ్వులు పంచేందుకు టైగర్స్ సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది

ప్రియదర్శి, చైతన్యకృష్ణ, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సూపర్ హిట్ కామెడీ వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ . గతేడాది విడుదలైన క్రేజీ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. భార్యల చేతిల్లో నలిగిపోతున్న భర్తల బాధలకు హాస్యాన్ని జోడించి సేవ్ ది టైగర్స్ సిరీస్ ను రూపొందించారు.ఇప్పుడీ సూపర్ హిట్ సిరీస్ కు సీక్వెల్ కూడా వస్తోంది. తాజాగా ‘టైగర్స్ ఈజ్ బ్యాక్’ అంటూ సేవ్ ది టైగర్స్ రెండో సీజన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ సీజన్ కు మించి ఈసారి మరిన్ని ట్విస్టులు, నవ్వులు పంచేందుకు టైగర్స్ సిద్ధమైనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రెండో సీజన్ లో సీరత్ కపూర్ మరో కీలక పాత్ర పోషించనుంది. ట్రైలర్ తో పాటు స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 15 నుంచి సేవ్ ది టైగర్స్ రెండో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
సేవ్ ది టైగర్స్ వెబ్‌సిరీస్‌లో ర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్ష వర్దన్, శ్రీకాంత్ అయ్యాంగార్, గంగవ్వ, వేణు యెల్దండి, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. యాత్ర సినిమాల డైరెక్టర్ మహి వి. రాఘవ, ప్రదీప్ అద్వైతం రూపొందించిన ‘సేవ్ ది టైగర్స్2’కు అరుణ్ కొత్తపల్లి దర్శకత్వం వహించారు. కాగా మార్చి 10 వరకు సేవ్ ది టైగర్స్ సీజన్ వన్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఫ్రీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. అంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్కైబర్లు అందరూ ఉచితంగా ఈ సిరీస్‌ను చూడొచ్చు.
సేవ్ ది టైగర్స్ 2 ట్రైలర్..
Aaaaaand the Tigers are backkk! 😈🐯Here is the trailer for the most awaited show of the year, with more twists, love, laughter and chaos!
Watch the Trailer Now:- https://t.co/uqyeXWMkqg#SaveTheTigersAgain Streaming from 15th March only on #DisneyPlusHotstar#HotstarSpecials… pic.twitter.com/w7YfyLeizr
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) March 2, 2024
టైగర్స్ ఈజ్ బ్యాక్..
⚠️ Valentine’s Day Warning ⚠️ THE TIGERS ARE BACK!!!
Can anyone save the tigers this time around?!
Get ready for pure madness 💥#SaveTheTigersAgain Coming soon only on #DisneyPlusHotstar@mahivraghav @PradeepAdvaitam @priyadarshi_i @AbhinavGomatam @jordarsujatha… pic.twitter.com/XY1IXXjG3Z
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 14, 2024
మార్చి 10 వరకు సీజన్ వన్ ఫ్రీగా స్ట్రీమింగ్..
Save The Tigers S2 is on its way! And now you can binge-watch the first season for FREE until March 10 🙌
Get going, Tigers 🐅 #SaveTheTigersAgain coming soon only on #DisneyPlusHotstar
Link – https://t.co/alAtoK4Ycq@mahivraghav @PradeepAdvaitam @PriyadarshiPN… pic.twitter.com/3ZOAz1zls1
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








