OTT Movie: ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. స్టార్ హీరోను మళ్లీ బతికించారు
ప్రముఖ ఓటీటీ సంస్థ తాజాగా ఓ వెబ్ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఇప్పుడీ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే కొన్నేళ్ల క్రితం చనిపోయిన ఒక హీరోను మళ్లీ ఈ సిరీస్ లో చూపించారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5, PRK ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘మారిగల్లు’ అనే ఓ కన్నడ వెబ్ సిరీస్‌ను నిర్మించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా ‘ మారిగల్లు ‘ వెబ్ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప సినిమాలో జాలి రెడ్డిగా నటించిన ధనుంజయ వాయిస్ ఓవర్ తో ఈ సిరీస్ టీజర్ ప్రారంభమవుతుంది. ఇందులో కదంబ రాజవంశ స్థాపకుడు, కర్ణాటక మొదటి రాజు మయూర శర్మ పాత్ర చాలా ఆసక్తికరంగా నిలిచింది. ఎందుకంటే ఈ పాత్రలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కనిపించారు. 4వ శతాబ్దపు కదంబ పాలన కథను ‘మరిగల్లు’ వెబ్ సిరీస్ లో చూపించనున్నారు. అలాగే కదంబుల మొదటి రాజు మయూర శర్మ గొప్పతనాన్ని కూడా చూపించనున్నారు. కదంబ యుగం కాలం నాటి నిధిని కనుగొనడానికి బయలుదేరిన సిర్సి యువకుల కథ నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో నమ్మకం, స్వార్థం, దురాశ వంటి భావోద్వేగాలతో మిళితమైన పాత్రలు ఉంటాయని చిత్ర బృందం తెలిపింది.
రంగాయణ రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే, ప్రవీణ్ తేజ్, ఎ.ఎస్. సూరజ్, ప్రశాంత్ సిద్ధి, నినాద హృత్స తదితరులు ఈ ‘మరిగల్లు’ వెబ్ సిరీస్‌లో నటించారు. పునీత్ రాజ్‌కుమార్ సతీమణి అశ్వనీ కుమార్ ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. దేవరాజ్ పూజారి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఎస్.కె. రావు సినిమాటోగ్రఫీ అందించారు. ఎల్.వి. ముత్తు, ఎల్.వి. గణేష్ సంగీతం సమకూర్చారు. ‘మేము ఇప్పటివరకు చేసిన వెబ్ సిరీస్‌ల కంటే మరిగల్లు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక దివ్య జానపద థ్రిల్లర్’ అని జీ5 బిజినెస్ హెడ్ దీపక్ శ్రీరాములు అన్నారు.
మరిగల్లు వెబ్ సిరీస్ లో దివంగత పునీత్ రాజ్ కుమార్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








