OTT Movie: 30 కోట్లతో తీస్తే ఏకంగా 300 కోట్లు.. ఓటీటీలోకి లేటెస్ట్ బాక్సాఫీస్ సంచలనం.. IMDBలో టాప్ రేటింగ్ మూవీ
ఏ మాత్రం అంచనాలు లేకుండా ఇటీవలే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ఓ సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆ మూవీ ఎప్పుడెప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. థియేటర్లలో రిలీజ్ కు ముందు అసలు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. పైగా చిన్న సినిమా ట్యాగ్. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిన్న సినిమానే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. రికార్డు వసూళ్లతో ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, అబ్బుర పరిచే యాక్షన్ సీన్స్, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. చాలా చోట్ల ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. అదే సమయంలో ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలనుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారి కోరిక నెరవేరనుంది. దీపావళి కానుకగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 20 నుంచి మలయాళం, తెలుగు తదితర భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?
మలయాళంలో ఇటీవల సంచలన విజయం సాధించిన సినిమా ‘లోక ఛాప్టర్ 1చంద్ర’. తెలుగులో కొత్త లోకగా విడుదలైంది. ఆగష్టు 28న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. మలయాళంతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. మలయాళంలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఇదే కావడం గమనార్హం.
డొమినిక్ తెరకెక్కించిన కొత్త లోకాలో కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్ లో నటించింది. అలాగే ప్రేమలు ఫేమ్ నస్లేన్, డాన్స్ మాస్టర్ శాండీ, విజయరాఘవన్, సంధు సలీంకుమార్, రఘునంద పలేరి, శివాజిత్ పద్మనాభన్, జైన్ ఆండ్రూస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, టోవినో థామస్, షౌబిన్ అతిథి పాత్రల్లో మెరిశారు. కాగా దీపావళి కానుకగా ఈ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రావొచ్చని తెలుస్తోంది. అక్టోబర్ 20 మలయాళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ ఈ సూపర్ హీరో యిన్ మూవీ అందుబాటులోకి రావచ్చని టాక్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
దీపావళి కానుకగా ఓటీటీలోకి..
#LokahChapter1 Make History Soon Within 43 days the overall grosser ₹299+cr#Lokah towards ₹300 cr will be the first Mollywood movie to get the highest grossing.🔥🔥👍#DulquerSalmaan #KalyaniPriyadarshan@dulQuer🌻 pic.twitter.com/QGJlJJcPWs
— Saseendran P (@SaseendranP12) October 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








