Oka Chinna Viramam: ‘ఆహా’లో పునర్నవి భూపాలం మూవీ ‘ఒక చిన్న విరామం’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

Oka Chinna Viramam: ఎప్పటికప్పుడు తమ ప్రేక్షకులకు కొత్త కంటెంట్‏తోపాటు.. డిఫరెంట్ కథాంశంతో కూడిన చిత్రాలను తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' అందిస్తున్న

Oka Chinna Viramam: 'ఆహా'లో పునర్నవి భూపాలం మూవీ 'ఒక చిన్న విరామం'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Oka Chinna Viramam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 06, 2021 | 7:35 AM

Oka Chinna Viramam: ఎప్పటికప్పుడు తమ ప్రేక్షకులకు కొత్త కంటెంట్‏తోపాటు.. డిఫరెంట్ కథాంశంతో కూడిన చిత్రాలను తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రారంభం నుంచి ప్రేక్ష‌కులు అంచ‌నాల‌కు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకుంటుంది.  అందులో భాగంగానే సూపర్ హిట్ సినిమాలతో.. సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‏లను, అగ్ర హీరోల సినిమాలతోపాటు.. ఇతర భాష సినిమాలను కూడా ‘ఆహా’ అందిస్తోంది.  ఇప్పుడు మరోసారి ‘ఆహా’ మరో థ్రిల్లర్ మూవీని తమ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.

బిగ్‏బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం ప్రధాన పాత్రలో, సంజయ్ వర్మ, గరిమా హీరోహీరోయిన్లుగా నటించిన థ్రిల్లర్ మూవీ ఒక చిన్న విరామం. డిఫరెంట్ కాన్సెప్ట్‏తో తెరకెక్కిన ఈ సినిమా జూలై 9 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ.. ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. బిజినెస్‏మేన్ అనుకొని పరిస్థితులలో కొందరు దుర్మార్గుల చేతిలో పడిపోవడం.. వారు చెప్పినట్లుగా వినడం.. ఆ తర్వాత అతను నవీన్ నేని, పునర్నవి భూపాలంతో కలిసి ప్రయాణం చేయడం.. ఆ తర్వాత వారి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయని కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2020లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఆహా వేదికగా ప్రేక్షకులను మరోసారి అలరించనుంది. ఈ చిత్రాన్ని మూన్ వాక్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించగా.. సందీప్ చేగురి దర్శకత్వం వహించారు. భరత్ మాచిరాజు సంగీతం అందించారు.

ట్రైలర్..

Also Read: Vidya Balan: విద్యాబాలన్‌కు అరుదైన గౌరవం..! జమ్మూకశ్మీర్‌లోని ఓ మిలిటరీ ఫైరింగ్‌ రేంజ్‌కు ఆమె పేరు

Covid-19 Fake Report: భార్య నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్.. కరోనా ఫేక్‌ రిపోర్ట్‌‌తో వేశాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Twins Suicide: వాళ్లిద్దరు కవలలు.. చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం.. అంతలోనే విషాదం.. ఎంజరిగిందంటే..!

Bone death: కరోనా బాధితుల్లో మరో కొత్త సమస్య.. ఇప్పటి వరకు ముగ్గురిలో గుర్తించామన్న వైద్య నిపుణులు