AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఈ వారం మరింత ఎంజాయ్ చేసేయండి.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే..

ప్రస్తుతం థియేటర్లు మూతపడినా... ప్రేక్షకులకు అరచేతిలో వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.. సూపర్ హిట్ సినిమాలతోపాటు..

OTT: ఈ వారం మరింత ఎంజాయ్ చేసేయండి.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే..
Ott Movies
Rajitha Chanti
|

Updated on: Jul 06, 2021 | 8:59 AM

Share

ప్రస్తుతం థియేటర్లు మూతపడినా… ప్రేక్షకులకు అరచేతిలో వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీ సంస్థలు.. సూపర్ హిట్ సినిమాలతోపాటు.. థ్రిల్లర్, సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఓటీటీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వారం వారం సరికొత్త కంటెంట్ అందిస్తూ.. ఆడియన్స్‏ను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా.. సూపర్ హిట్ సినిమాలను అందించడంలో విజయం సాధించాయి. అందుకే ఓటీటీలకు రోజు రోజూకీ ఆదరణ పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే.. ఈ వారం కూడా మరింత వినోదాన్ని అందించడానికి సిద్దమయ్యాయి. మరి అవెంటో తెలుసుకుందామా.

Vikramarkudu

Vikramarkudu

విక్రమార్కుడు.. 2018లో తమిళంలో విడుదలైన ‘జుంగా’ తెలుగులో ‘విక్రమార్కుడు’ పేరుతో రిలీజ్ అయ్యింది. సాయోషా, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని గోకుల్ తెరకెక్కించారు. ఇందులో విజయ్ సేతుపతి డాన్ గా సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. అంతేకాకుండా.. యోగిబాబు కీలక పాత్రలో నటించగా.. యాక్షన్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన విక్రమార్కుడు మూవీ జూలై 9న తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది.

Saras

Saras

“సారాస్” అన్నాబెన్ నటించిన మలయాళ చిత్రం “సారాస్”. అమెజాన్ ప్రైమ్ లో జూలై 5న విడుదలైంది. జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు. ‘కుంబలాంగి నైట్స్‌’ సినిమాతో అరంగేట్రం చేసి ‘కప్పెలా’, ‘హెలెన్‌’ లాంటి హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అన్నాబెన్‌ నటించిన ‘సారాస్‌’పై అంచనాలు పెరిగాయి. ఇందులో ఆమె అసోసియేట్‌ డైరెక్టర్‌గా కనిపించనుంది. పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం ఉండని యువతి. ఎప్పటికైనా మెగాఫోన్‌ పట్టి సినిమా తీయాలనేది ఆమె కల. మరి ఆ కలను సారా నెరవేర్చుకుందా? ఈ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది తెలియాలంటే ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

State Of Siege

State Of Siege

‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ బాలీవుడ్ నటుడు అక్షన్ ఖన్నా ‘స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ అటాక్’ చిత్రంతో డిజిటల్ అరంగేట్రం చేయబోతున్నాడు. గుజరాత్ లోని అక్షరధామ్ దేవాలయంపైన జరిగిన తీవ్రవాదుల దాడి ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అక్షన్ ఖన్నా ఎన్ఎస్జీ కమాండర్ హనుత్ సింగ్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ మూవీ జూలై 9న జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Oka Chinna Viramam

Oka Chinna Viramam

‘ఒక చిన్న విరామం’.. బిగ్‏బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం కీలక పాత్రలో సంజయ్ వర్మ, గరిమా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఒక చిన్న విరామం. బిజినెస్ మ్యాన్ దిపర్ లాభాలు సాధించాలని తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే కథాంశంతో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా శుక్రవారం జూలై 9న తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా పలు ఓటీటీ సంస్థలలో స్ట్రీమింగ్ కానున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

జీ5 చతుర్‌ ముఖం (జులై 9) క్రష్‌ జులై 9 లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌(జులై 9)

నెట్‌ఫ్లిక్స్‌: హిడెన్‌ స్ట్‌ ఆఫ్‌ గుజరాత్‌ (జులై 9) ఐ థింక్‌ యు షుడ్‌ లీవ్‌ విత్‌ టిమ్‌ రాబిన్సన్‌ (జులై 6) ది వార్‌ నెక్స్ట్‌ డోర్‌(జులై 7) క్రాల్‌ (జులై 11) డోరా అండ్‌ ది లాస్ట్‌ సిటీ ఆఫ్‌ గోల్డ్‌ (జులై 11) రెసిడెంట్‌ ఈవిల్‌: ఇన్ఫెనిట్‌ డార్క్‌నెస్‌ (జులై 8) ఆప్టికల్‌: సీజన్‌ 4(జులై 9) వర్జిన్‌ రివర్‌: సీజన్‌ 3 జులై 9 హౌ ఐ బికమ్‌ ఏ సూపర్‌ హీరో (జులై 9)

బుక్‌ మై షో స్ట్రీమ్‌ వేలుక్కక్క ఒప్పు కా (జులై 6) వన్‌ ఫర్‌ ఆల్‌ (జులై 9)

Also Read: