AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Why I Killed Gandhi: ఓటీటీలో రిలీజ్ కు ‘వై ఐ కిల్డ్ గాంధీ’ రెడీ.. స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్.. నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..

Why I Killed Gandhi in OTT: గాంధీ, గాడ్సే నేపధ్యంలో తెరకెక్కిన 'వై ఐ కిల్డ్ గాంధీ' (Why I Killed Gandhi)మూవీ డిజిటల్ లో (OTT) రిలీజ్ కు రంగం సిద్దమైంది. అయితే ఈ సినిమా విడుదలపై స్టే..

Why I Killed Gandhi: ఓటీటీలో రిలీజ్ కు 'వై ఐ కిల్డ్ గాంధీ' రెడీ.. స్టే విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్..  నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి..
Why I Killed Gandhi
Surya Kala
|

Updated on: Jan 28, 2022 | 12:50 PM

Share

Why I Killed Gandhi in OTT: గాంధీ, గాడ్సే నేపధ్యంలో తెరకెక్కిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ (Why I Killed Gandhi)మూవీ డిజిటల్ లో (OTT) రిలీజ్ కు రంగం సిద్దమైంది. అయితే ఈ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ సుప్రీం కోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలైంది. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం గాంధీ , గాడ్సేపై చిత్రానికి వ్యతిరేకంగా న్యాయవాది అనూజ్ భండారీ సికిందర్ బహల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ప్రకారం, ఈ చిత్రంలో మహాత్మా గాంధీ చిత్రాన్ని కించపరిచే ప్రయత్నం జరిగింది. ఈ చిత్రంలో నాథూరామ్ గాడ్సే కీర్తించారు. ఈ సినిమా ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం జరుగుతోంది. కనుక ఈ సినిమాను నిషేధించాలి. ఈ సినిమా విడుదలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సెన్సార్ బోర్డు ఈ సినిమాని ఆమోదించలేదు: ఈ పిటిషన్‌లో, అనూజ్ భండారీ ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. విడుదల తర్వాత అది ఆగిపోయింది, దీని కారణంగా ఈ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల కానుంది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దీనిని విడుదల చేయనున్నారు. నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని కాల్చి చంపిన రోజు ఇదే. అనే అంశం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

2017లో సినిమా పూర్తి: ఈ సినిమా 2017లోనే పూర్తయింది. థియేటర్లలో విడుదల చేసే అవకాశం రాలేదు. దీంతో ఈ సినిమాను ఇప్పుడు చిత్ర నిర్మాతలు OTTలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు, ఎంపి అమోల్ కొల్హే నాథూరామ్ గాడ్సే పాత్రను పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా విడుదలపై వివాదం నెలకొంది. దీంతో సుప్రీం కోర్టు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయితే ఇప్పటి వరకూ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సినిమాల రిలీజ్ పై ఎటువంటి పరిమితులు లేవు. అయితే ఇప్పుడు.. గాంధీ, గాడ్సేపై రూపొందిన వై ఐ కిల్డ్ గాంధీ మూవీ ఓటీటీలో విడుదలకు రెడీ అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు మళ్ళీఓటీటీ లో మూవీకి సెన్సార్ అనేది కరెక్టా ? తప్పా అనే చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది.

Also Read:

యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!