AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలోకి వస్తోన్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

సినీప్రియులను ఆకట్టుకునేందుకు నిత్యం కొత్త జానర్ చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. తమిళం, మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో మిస్టరీ థ్రిల్లర్ మూవీ తెలుగు అడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమాను ఓటీటీ లవర్స్ కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

OTT Movie: ఓటీటీలోకి వస్తోన్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్.. ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
The Secret Of Women Movie
Rajitha Chanti
|

Updated on: Mar 06, 2025 | 5:22 PM

Share

మలయాళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్. దాదాపు నెలరోజులపాటు ఈ చిత్రానికి అడియన్స్ నుంచి ఆదరణ లభించింది. ఈ సినిమాకు ప్రజేస్ సేన్ దర్శకనిర్మాతగా వ్యవహరించగా.. ఇందులో నిరంజన, అనూప్, అజు వర్గీస్, శ్రీకాంత్ మురళి కీలకపాత్రలు పోషించారు. ఇద్దరు మహిళల జీవితాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో దర్శకుడు ప్రజేస్ సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. థియేటర్లలో విడుదలకు ముందే ఈ సినిమా పలు ఫిలిమ్ ఫెస్టివల్స్ లో స్ర్కీనింగ్ అయ్యింది. థియేటర్లలో మాత్రం మోస్తారు ఆదరణను సొంతం చేసుకుంది.

పురుషాధిక్యతకు సంబంధించిన మెసేజ్ ను థ్రిల్లర్ కథలో జోడించి ఈ మూవీని అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు ప్రజేస్ సేన్. ఈ చిత్రానికి అనిల్ కృష్ణ, జోష్యా వీజే మ్యూజిక్ అందించగా.. నిరంజన మోహన్ మలయాళంలో హీరోయిన్ గా అనేక చిత్రాల్లో నటించింది. మమ్ముట్టి టర్బో, పల్లోట్టి 90 కిడ్స్, ఇరా, కేరాఫ్ సైరాభానుతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది. ఇదిలా ఉంటే.. ఇన్నాళ్లు థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేసిన ది సీక్రెట్ ఆఫ్ ఉమెన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

థియేటర్లలో విడుదలైన నెల రోజులకు ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఐఎమ్ డీబీలో 9.1 రేటింగ్ ఉంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..