Dance Ikon- Aha: ఆహా ఫ్యామిలీలోకి రమ్యకృష్ణ.. డ్యాన్స్ ఐకాన్‌ షో జడ్జిగా రాజమాత.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

RamyaKrishna: డిజిటల్‌ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా (AHA OTT). ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్‌ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను సినీ ప్రియులకు అందించింది.

Dance Ikon- Aha: ఆహా ఫ్యామిలీలోకి రమ్యకృష్ణ.. డ్యాన్స్ ఐకాన్‌ షో జడ్జిగా రాజమాత.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ramya Krishna
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2022 | 5:34 PM

Ramya Krishna: డిజిటల్‌ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా (AHA OTT). ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్‌ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను సినీ ప్రియులకు అందించింది. అలాగే అన్‌స్టాపబుల్‌ అంటూ టాక్‌షోలు, తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ సింగింగ్‌ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈనేపథ్యంలో నాన్‌-ఫిక్షన్ కేటగిరీలో మరోసారి తన ప్రత్యేకత చాటుకునేందుకు డ్యాన్స్‌ షోతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చింది. డ్యాన్స్‌ ఐకాన్‌ పేరుతో నిర్వహించబోతోన్న ఈ షోకు ప్రముఖ యాంకర్‌ ఓంకార్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ షోకు న్యాయనిర్ణేతగా లేడీ సూపర్ స్టార్ రమ్యకృష్ణ వ్యవహరించబోతున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం (సెప్టెంబర్ 11న ఆహాలో ప్రీమియర్ అయింది. అలాగే సెప్టెంబర్ 17 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ డ్యాన్సింగ్‌ షో స్ట్రీమింగ్‌ కానుంది.

కాగా ఈ డ్యాన్స్‌షో తో తొలిసారిగా డిజిటల్‌ ఎంటర్‌టైన్మెంట్‌ రంగంలోకి అడుగుపెట్టనున్నారు రమ్యకృష్ణ. దీనిపై స్పందించిన ఆమె.. ‘డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా అరంగేట్రం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటీవల కాలంలో ఇలాంటి విభిన్నమైన కాన్సెప్ట్‌తో ఎవరూ షోను నిర్వహించలేదు. ఈ కార్యక్రమంలో మీరూ ఎప్పుడూ చూడని ఒక కొత్త రమ్యకృష్ణను చూడబోతున్నారు.అందరూ ఈ షో ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. అలాగే ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. డ్యాన్స్ ఐకాన్‌తో ఆహా ఫ్యామిలీలోకి రమ్యకృష్ణని మేం స్వాగతిస్తున్నాము. ఆమె ఎంతో మందికి ఒక రోల్ మోడల్. డ్యాన్స్‌పై ఆమెకున్న అవగాహన అసమానమైనది’ అని చెప్పుకొచ్చారు. ఇక డ్యాన్స్‌ షో యాంకర్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్న ఓంకార్‌ మాట్లాడుతూ.. ‘రమ్యకృష్ణ ఈ షో కి జడ్జిగా వ్యవహరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రమ్య గారితో పనిచేయాలి అనే నా కల ఇలా సాకరమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ డ్యాన్స్ ఐకాన్ షో ద్వారా అందరికీ నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే