Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. మొత్తం 16 ఎపిసోడ్స్.. ఆద్యంతం కట్టిపడేసే సీన్స్..

ప్రస్తుతం ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా.. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ ఇప్పుడు ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొత్తం 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సీరీస్ ఇప్పటివరకు మొత్తం 43 అవార్డ్స్ గెలుచుకుంది. ఇంతకీ ఈ సిరీస్ పేరెంటో తెలుసా..?

OTT Movie: ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్.. మొత్తం 16 ఎపిసోడ్స్.. ఆద్యంతం కట్టిపడేసే సీన్స్..
Rocket Boys
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2025 | 8:23 AM

Share

ఈమధ్యకాలంలో నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్, సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ఇందులో నటీనటుల యాక్టింగ్, కథ, కథాంశం ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఇప్పుడు IMDB 8.8 రేటింగ్ తోపాటు ఏకంగా 43 అవార్డ్స్ గెలుచుకుంది. అదే రాకెట్ బాయ్స్. ఇప్పటివరకు రెండు సీజన్స్ విడుదలయ్యాయి. మొదటి సీజన్ 2022లో రిలీజ్ కాగా.. ఈ సిరీస్ భారతదేశ రాకెట్ ప్రోగ్రామ్ ఆధారంగా రూపొందిచబడింది. మన శాస్త్రవేత్తలు హోమీ జహంగీర్ భాభా, విక్రమ్ సారాభాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు.

ఇందులో జిమ్ సర్భ్, ఇష్వాక్ సింగ్, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో వీరి యాక్టింగ్ అద్భుతంగా ఉండడంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. రెండు భాగాలుగా ఉన్న ఈ సిరీస్ లో మొత్తం 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటివరకు 43 అవార్డ్స్ గెలుచుకున్న ఈ సిరీస్.. అకాడమీ అవార్డు నుండి ఉత్తమ వెబ్ సిరీస్‌గా ఇండియన్ టెలివిజన్ అవార్డును అందుకుంది. 1940 నుంచి 1960 వరకు భారతదేశంలోని కీలకమైన దశాబ్దాలను చూపిస్తుంది. సైన్స్ రంగంలో స్వతంత్ర భారతదేశం ప్రారంభ సంవత్సరాలను ఈ సిరీస్ హైలెట్ చేస్తుంది. డాక్టర్ హోమి జె భాభా భారతదేశ అణు కార్యక్రమానికి నాయకత్వం వహించడం.. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష కార్యక్రమానికి ఇతర అనేక సంస్థలకు పునాది వేశారు.

ఈ సిరీస్ లో కీలకపాత్రలో నటించిన జిమ్ సర్భ్ ఉత్తమ నటుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ అవార్డ్ అందుకున్నారు. అలాగే ఈ సిరీస్ ఉత్తమ స్క్రీన్ ప్లేకు ఫిలింఫేర్ అవార్డును, అభయ్ పన్ను ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డ్ గెలుచుకుున్నారు. ఈ సిరీస్ రెండు భాగాలు ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..