OTT Movie: ఏం సిరీస్ మావ.. ఓటీటీలో మెంటలెక్కిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. రెండు నెలలుగా టాప్ ట్రెండింగ్..
ప్రతిరోజు ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, షోలు, సరికొత్త కంటెంట్ గేమ్ షోలు అడియన్స్ ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకుల ఆసక్తిని బట్టి థ్రిల్లర్, క్రైమ్ కామెడీ, సస్పెన్స్, హారర్ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక షో వరుసగా రెండు నెలలు టాప్ 10లో దూసుకుపోతుంది. ఇంతకీ ఆ సిరీస్ పేరెంటో తెలుసా.. ?

ఇటీవల కాలంలో ఓటీటీలో కొత్త కంటెంట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. సస్పెన్స్, హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక సిరీస్ మాత్రం రెండు నెలలుగా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఈ సిరీస్ కు ప్రత్యేకత కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సిరీస్ ఒక క్రైమ్ థ్రిల్లర్. కథ ఒక కల్పిత నగరంలో జరుగుతుంది. అక్కడ వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దర్యాప్తులో హత్యలకు సంబంధించిన సీక్రెట్ రివీల్ అవుతుంది. మిస్టరీ, అతీంద్రియ భయానక, మానసిక థ్రిల్లర్ అంశాలతో ఈ సిరీస్ సాగుతుంది. ఈ హత్యలను CIB అధికారి రియా థామస్ (వాణి కపూర్), సస్పెండ్ చేయబడిన పోలీసు అధికారి విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా) దర్యాప్తు చేస్తారు. దర్యాప్తు సమయంలో, ఈ హత్యలు శతాబ్దాల నాటి ‘ఐస్ట్ మండల్’ అనే రహస్య సంస్థతో, బాధితులతో ముడిపడి ఉన్నాయని వారు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సిరీస్.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు మండల మర్డర్స్. జూలై 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. మొదటి రోజు నుంచి ఇప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ గా రెస్పాన్స్ అందుకుంది. ఈ సిరీస్ విడుదలైనప్పటి నుండి రెండు నెలలకు పైగా నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో ఉంది. ఇందులో వాణి కపూర్, సుర్వీన్ చావ్లా, వైభవ్ రాజ్ గుప్తా కీలకపాత్రలు పోషించారు. ఇందులో ప్రతి సన్నివేశం ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ ‘ది బుచర్ ఆఫ్ బెనారస్’ నవల ఆధారంగా రూపొందించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
YRF ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సిరీస్ గోపి పుత్రన్, మనన్ రావత్ దర్శకత్వం వహించారు. ఈ షో మొత్తం 8 ఎపిసోడ్‌లతో ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ దాదాపు 40 నిమిషాల నిడివి ఉంటుంది. ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..




