OTT Movie: ఓటీటీలో ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఐఎమ్‌డీబీలో 9.3/10 రేటింగ్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
కొన్ని రోజుల క్రితమే థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కథ కథనాలు కొత్తగా ఉండడంతో ఆడియెన్స్ ఈ మూవీపై బాగానే ఇంట్రెస్ట్ చూపించారు. ఐఎమ్ డీబీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు ఇప్పటికీ 9.3/10 రేటింగ్ ఉండడం గమనార్హం.

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేయనున్నాయి. ఇందులో ఒక సైకలాజికల్ అండ్ మైథాలజీ థ్రిల్లర్ కూడా ఉంది. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది. కథ కథనాలు కొత్తగా ఉండడం, పేరున్న నటీనటులు యాక్ట్ చేవడంతో చాలా మంది ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపించారు. అందుకే ఐఎమ్ డీబీలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు ఇప్పటికీ 9.3/10 రేటింగ్ ఉండడం గమనార్హం. ఈ సినిమా మొత్తం శ్యామ్ కతు అనే ఓ సైకియాట్రిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతని కొడుకు, కోడలు చనిపోవడంతో తన మనవరాలు నిధిని అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. ఒక రోజు స్కూల్ కు వెళ్లిన నిధి ఇంటికి రాదు. దీంతో శ్యామ్ పోలీసులను ఆశ్రయిస్తాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభిస్తారు. అయితే దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయి. నిధి మిస్సింగ్ కేసుకు లేడీ డాన్ వాకిలి పద్మ, ఆమె మేనల్లుడు దేవ్ కు సంబంధం ఉందని తెలుస్తోంది. అసలు లేడీ డాన్ పద్మ ఎవరు? ఆమె చేసే అక్రమాలేంటి? నిధిని ఎందుకు కిడ్నాప్ చేసింది? శ్యామ్ తన మనవరాలిని ఎలా వెతికి పట్టుకున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స తెరకెక్కించిన ఈ సినిమాలో డాక్టర్ శ్యామ్‌గా సత్యరాజ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే చాలా రోజుల తర్వాత లేడీ డాన్ రోల్‌లో రీఎంట్రీ ఇచ్చింది ఉదయభాను. వీరితో పాటు సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమా రిలీజ్ సమయంలో దర్శకుడు మోహన్ శ్రీవత్స సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. తన సినిమాను ఎవరూ ఎవరూ థియేటర్లలో చూడడంలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. మరోవైపు ఉదయభాను కూడా కన్నీరుమున్నీరైంది. ఇలా త్రిబాణధారి బార్బరిక్ సినిమా రిలీజ్ సమయంలో చాలా సంఘటనలు జరిగాయి. ఇప్పుడు ఓటీటీలోకి ఈ మూవీ రానుంది.
సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..
Love, loss & an unbreakable bond — a psychiatrist’s fight to find his granddaughter. Tribanadhari Barbarik, streaming Oct 10 on SunNXT.#SunNXT #SunNXTTribanadhariBarbarik #TribanadhariBarbarik #Sathyaraj #SathyamRajesh #Vasista #Udayabhanu pic.twitter.com/tN1bfI1bvp
— SUN NXT (@sunnxt) October 5, 2025
అక్టోబర్ 10 నుంచి త్రిబాణధారి బార్బరిక్’ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా విడుదల కానుందని సోషల్ మీడియాలో ఒక పోస్టర్‌ను పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








