OTT: నిద్రలోనూ వదలడు.. కలలోకి వచ్చి మరీ చంపేసే సైకో కిల్లర్.. ఓటీటీలో వణుకు పుట్టించే సినిమా.. మిస్ అవ్వద్దు
సాధారణంగా సైకో కిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథ సాగిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడీ సినిమాలో మాత్రం సైకో కిల్లర్ నిద్రలోనూ వదలడు. వారి కలలోకి వచ్చి మరీ హతమారుస్తాడు. ప్రస్తుతం ఓటీటీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న ఆ సినిమా పేరు
ఇతర జానర్లతో పోల్చితే ఓటీటీలో సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఆదరణ ఎక్కువ. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో రిలీజైన హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు స్ట్రీమింగ్ కు తీసుకొస్తుంటాయి. ఆయా భాషల వారికి తగ్గట్టుగా డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తాయి. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనూ ఓ సూపర్బ్ సైకో థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా సైకో కిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథ సాగిపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడీ సినిమాలో మాత్రం సైకో కిల్లర్ నిద్రలోనూ వదలడు. వారి కలలోకి వచ్చి మరీ హతమారుస్తాడు. ప్రస్తుతం ఓటీటీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్న ఆ సినిమా పేరు ‘ది నైట్ మెర్ ఆన్ ఈఎల్ఎమ్ స్ట్రీట్’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడీ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
‘ది నైట్ మెర్ ఆన్ ఈఎల్ఎమ్ స్ట్రీట్’ సినిమా కథ విషయానికొస్తే.. స్ప్రింగ్ వుడ్ డైనర్ అనే ఓ రెస్టారెంట్ లో ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే డీన్ అనే ఒక స్టూడెంట్ ఒంటరిగా కూర్చొని మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు అతని కలలోకి డీన్ లో సగం కాలిపోయిన ఓ వ్యక్తి చేతికి బ్లేడెడ్ గ్లౌజ్ వేసుకుని తనని చంపడానికి వస్తాడు. తీరా చూస్తే రియాలిటీలో కూడా డీన్ తానే తన మెడను కట్ చేసుకుని చని పోతాడు.ఆ తర్వాత మరో స్టూడెంట్ క్రిస్ప్ కు కూడా డీన్ లానే కలలు వస్తాయి. ఆమెకు కూడా కలలో ఎవరో ఒకరు చంపడానికి వస్తున్నట్లుగా కనిపిస్తాడు. దీనితో క్రిస్ప్ భయపడిపోతాడు. నిద్రపోతే తానూ కూడా డీన్ లానే చనిపోతానేమో అనుకుని.. నిద్రపోవడం మానేస్తుంది. కానీ ఒకానొక దశలో మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. అంతే ఆ సగం కాలిన వ్యక్తి వచ్చి ఆమెను దారుణంగా చంపేస్తాడు. ఆ తర్వాత మరికొందరు కూడా ఇలాగే చనిపోతారు. మరి అసలు ఆ సగం కాలిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు నిద్రపోయిన వారందరిని చంపేస్తాడు ? ఇవన్నీ తెలియాలంటే.. “ది నైట్ మెర్ ఆన్ ఈఎల్ఎమ్ స్ట్రీట్” అనే ఈ సినిమాను చూడాల్సిందే.
‘ది నైట్ మెర్ ఆన్ ఈఎల్ఎమ్ స్ట్రీట్’ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.