Ali Fazal: గుడ్‌న్యూస్ చెప్పిన ‘గుడ్డూ భయ్యా’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి హీరోయిన్.. ఫొటోస్ వైరల్

బాలీవుడ్ స్టార్ కపుల్ అలీ ఫజల్, రిచా చద్దా శుభ వార్త చెప్పారు. తమ ఇంట్లోకి పండంటి బిడ్డ అడుగుపెట్టిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అలీ ఫజల్, రిచా చద్దా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

Ali Fazal: గుడ్‌న్యూస్ చెప్పిన 'గుడ్డూ భయ్యా'.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరామండి హీరోయిన్.. ఫొటోస్ వైరల్
Ali Fazal Family
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2024 | 10:33 AM

బాలీవుడ్ స్టార్ కపుల్ అలీ ఫజల్, రిచా చద్దా శుభ వార్త చెప్పారు. తమ ఇంట్లోకి పండంటి బిడ్డ అడుగుపెట్టిందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారీ లవ్లీ కపుల్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అలీ ఫజల్, రిచా చద్దా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు. బేబీ బంప్ తో ఉన్న తన భార్యతో కలిసున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన అలీ ఫజల్.. ‘మాకు పండంటి ఆడ‌బిడ్డ పుట్టింద‌ని చెప్పేందుకు చాలా ఆనందంగా ఉంది. జులై 16న పసి పాప మా ఇంట్లోకి అడుగుపెట్టింది. మా బిడ్డకు మీ అంద‌రి ఆశీర్వాదాలు కావాలి’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు అలీ ఫజల్. రిచా చద్దాలది – అలీ ఫజల్ ది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు నాలుగేళ్లు ప్రేమలో మునిగి తేలారు. ఫ‌క్రీ సెట్స్‌లో మొదటిసారి కలిశారు క‌లిశారు రిచా, అలీ. ఆ తర్వాత స్నేహితులగా మారారు. ఆపై వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2017 తమ ప్రేమ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఇరు కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో 2020 అక్టోబర్ లో పెళ్లిపీటలెక్కారీ లవ్ బర్ద్స్.

తమ వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో త‌ల్లిదండ్రులు కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు రిచా చ‌ద్దా, అలీ ఫ‌జ‌ల్. 1 + 1 = 3 అంటూ సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకున్నారు. ‘ఒక చిన్న గుండె చ‌ప్పుడు.. మా ప్ర‌పంచంలో చాలా అంద‌మైన శ‌బ్దం’ అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు త‌మ మొద‌టి బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికారు.

ఇవి కూడా చదవండి

కాగా మీర్జా పూర్ వెబ్ సిరీస్ ద్వారా తెలుగు వారికి బాగా చేరవయ్యాడు అలీ ఫజల్. ఇందులో అతను పోషించిన ‘గుడ్డూ భయ్యా’ పాత్ర బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పటికే మీర్జాపూర్ వెబ్ సిరీస్ రెండు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది.

View this post on Instagram

A post shared by ali fazal (@alifazal9)

ఇక రిచా చద్దా విష‌యానికొస్తే.. ఇటీవల ఆమె నటించిన హీరామండి వెబ్ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో రిచా పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..