Unstoppble With NBK Season 2: ‘బాలకృష్ణను ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో చూస్తారు’.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్..

సీజన్ 2 కోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో జతకటింది మన ఆహ. జాంబీ రెడ్డి, కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలింతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు.

Unstoppble With NBK Season 2: 'బాలకృష్ణను ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో చూస్తారు'.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్..
Unstoppble With Nbk Season
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 02, 2022 | 7:58 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‏తో సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. సూపర్ హిట్ మూవీస్.. సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, టాక్ షోలతో డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది. ఇక గతంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ షోకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడూ యాక్షన్ చిత్రాలతో మెప్పించిన బాలయ్య.. మొదటిసారి ఓ టాక్ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించడం.. తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. ఆడియన్స్‏కు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలను సున్నితంగా అతిథుల నుంచి రాబట్టారు. అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1కు రికార్డ్ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది.

సీజన్ 2 కోసం మరోసారి స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో జతకటింది మన ఆహ. జాంబీ రెడ్డి, కల్కి లాంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ 2011 లో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిలింతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. అలా మొదలుబెట్టిన తన ప్రయాణం దర్శకత్వం అన్ స్టాపబుల్ సీసన్ 1 వరకు సాగింది. నందమూరి బాలకృష్ణను ఇలా కూడా చూడగలమా అనేంత గొప్పగా చూపించారు. ఇప్పుడు మరోసారి ఎవరూ ఊహించని విధంగా నందమూరి బాలకృష్ణ ను చూపించబోతున్నారు ప్రశాంత్ వర్మ.

దర్శకులు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ” బాలకృష్ణ గారు టాక్ షో చేస్తున్నారు అనగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. నాకు ఫస్ట్ ప్రోమో షూట్ చేసే అవకాశం వచ్చింది. ఆహా వాళ్లు ఫస్ట్ ప్రోమో కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. ఆయన చేసిన సినిమాల నుంచి ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో ఆ రేంజ్ లో ఉండాలని మొదటి ప్రోమో చేశాము. దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది. హాబ్బీస్ లాంటి పెద్ద ఇంటర్నెషనల్ అవార్డ్స్ సైతం వచ్చాయి. మళ్లీ సీజన్ 2 చేస్తున్నప్పుడు మళ్లీ నన్ను కలిశారు. దీంతో కాస్త టెన్షన్ పడ్డాను. ఎందుకంటే సీజన్ 1 అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. సీజన్ 1 కంటే సీజన్ 2 అంతకు మించి ఉండాలనుకున్నాము. క్రేజీగా ఉండాలనుకున్నాం. చాలా ఐడియాస్ వచ్చాయి. ఫైనల్ గా ఒక స్టోరీ రాశాను. అందరికీ నచ్చింది. దీంతో ఆహావాళ్లు కూడా ఒకే చేశారు. ఒక టాక్ షో ప్రోమో కోసం ఇంత బడ్జెట్‏తో చేయడానికి ఆహా మేకర్స్ వెనకడలేదు. రెండు రోజుల నుంచి రాత్రింబవళ్లు షూట్ చేస్తున్నాము. బాలకృష్ణగారిని ఎప్పుడూ చూడని కొత్త అవతారంలో చూస్తారు. ఈ ప్రోమో మీ అందరికీ నచ్చుతుంది. సీజన్ 1 కంటే.. సీజన్ 2కి మంచి రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.