OTT Movie: బడ్జెట్ కంటే 6 రెట్లు ఎక్కువ కలెక్షన్స్.. 150 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
గత కొన్ని సంవత్సరాలుగా సినీప్రియులలో సైకో థ్రిల్లర్ సినిమాల క్రేజ్ పెరిగిపోయింది. అలాగే ఈమధ్య కాలంలో హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మీకు తెలుసా. ? ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై దాదాపు 150 బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సినిమా ఏంటో.. ? ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకుందామా.

ప్రస్తుతం ఓటీటీల్లో వివిధ జానర్స్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈమధ్యకాలంలో జనాలు ఎక్కువగా హారర్, సస్పెన్స్ చిత్రాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం బాక్సాఫీస్ షేక్ చేసిన సైకో థ్రిల్లర్ మూవీ గురించి మీకు తెలుసా.. ? ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా దాదాపు 150 రోజులు థియేటర్లలో దూసుకుపోయింది. ప్రస్తుతం IMDb లో రేటింగ్ 7.2 ఉన్న ఈ సినిమాను చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో కోలీవుడ్ సూపర్‌స్టార్ భార్య, స్టార్ హీరో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హీరో కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇది. ఇంతకీ ఇది ఏ సినిమా? బడ్జెట్ ఎంత, కలెక్షన్ ఎంత అనే విషయాలు తెలుసుకుందామా.. ?
ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో భార్య జ్యోతిక కథానాయికగా నటించగా.. తమిళ్ హీరో శింబు ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో శింబు మొదటిసారి ద్విపాత్రాభినయం చేశారు. ఆ సినిమా మరెదో కాదు.. ‘మన్మధన్’. 2004 దీపావళికి విడుదలైన ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ. 5 కోట్లు మాత్రమే. కానీ విడుదలయ్యాక ఈ మూవీ దాని బడ్జెట్ కంటే 6 రెట్లు ఎక్కువ అంటే రూ. 30 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దాదాపు 21 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టడం అంత తేలికైన విషయం కాదు.
కథ విషయానికి వస్తే.. జ్యోతిక (మైథిలి), శింబు (మదన్) ఓ కాలేజీలో పార్ట్ టైమ్ సంగీతం నెర్చుకుంటుంటారు. ఒకరోజు మైథిలికి మదన్ తనపై దాడి చేసినట్లు కల వస్తుంది. ఆమె మదన్ ని చూసి భయపడుతుంది. కానీ క్రమంగా ఆమె మదన్ స్వభావానికి ఆకట్టుకుంటుంది. వారిద్దరూ స్నేహితులు అవుతారు. కానీ మదన్ కొందరు అమ్మాయిలను హత్యే చేసే సీరియల్ కిల్లర్ గా చూపించడంతో అప్పుడే సినిమాలో అసలు ట్విస్టు స్టార్ట్ అవుతుంది. అమ్మాయిల మృతదేహాలను తగలబెట్టి, వారి అస్థికలను వారి పేర్లు ఉన్న సీసాలలో జమ చేస్తాడు. నగరంలో బాలికల హత్యలు మీడియా దృష్టిని ఆకర్షించినప్పుడు, ACP దేవా (అతుల్ కులకర్ణి) హంతకుడిని కనుగొనడానికి రంగంలోకి దిగుతాడు. మైథిలి మదన్ ని ఒక అమ్మాయితో చూస్తుంది. మరుసటి రోజు ఆ అమ్మాయి హత్యకు గురైందనే వార్త వస్తుంది. అమ్మాయిలను హత్య చేస్తున్నది మదన్ అని మైథిలి భావిస్తుంది. ఆమె ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తుంది. అప్పుడు మరిన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. చివరకు మదన్ ఎందుకు అమ్మాయిలను హత్య చేయాల్సి వచ్చింది అనేది తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..




