OTT Movie: బ్యాంక్ రాబరీ ఇలా కూడా చేస్తారా? ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్.. ఊహించని ట్విస్టులు
ఇవాళ శుక్రవారం (మే16) కాబట్టి థియేటర్లతో పాటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే ఓ తెలుగు థ్రిల్లర్ సినిమా మాత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.

బ్యాంక్ రాబరీ నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. హాలీవుడ్ లో మనీ హీస్ట్ మొదలు మొన్నటి సత్యదేవ్ జీబ్రా వరకు చాలా సినిమాలు ఈ బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో తెరకెక్కినవే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. పేరున్న నటీనటులు లేకపోయినా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. కథా, కథనాలు, గ్రిప్పింగ్ స్క్రీన ప్లే, ట్విస్టులు ఆడియెన్స్ ను మెప్పించాయి. దీంతో వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స ను థ్రిల్ కు గురిచేసిన ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం (మే16) అర్ధరాత్రి నుంచే ఈమూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడులైన 20 రోజుల్లోపే ఈ సినిమా ఓటీటీలోకి రావడం గమనార్హం. ఈ సినిమా కథ విషయానికి వస్తే..
హీరోకి దర్శకుడు కావాలనేది కల. కానీ అతనితో సినిమా తీసేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రారు. దీంతో బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని కూడా తన బ్యాంక్ రాబరీ ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలిసాయం కూడా తీసుకుంటాడు. తాము ఉంటున్న ఓ స్కూల్ బిల్డింగ్ నుంచి బ్యాంకు లోపలికి సొరంగం తవ్వి డబ్బును దొంగలించాలనుకుంటారు. మరి వీరి ప్రయత్నం ఫలించిందా? గ్రామస్తులు హీరోతో పాటు అతడి స్నేహితులను ఎందుకు చంపాలనుకున్నారు? అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.
ఈ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ పేరు చౌర్య పాఠం. ఇందులో ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. మస్త్ అలీ, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. సుప్రియ ఐసోల ఇందులో విలన్ గా నటించడం గమనార్హం. ఈ క్రైమ్ కామెడీ మూవీకి ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమేని కథను అందించారు. అలాగే ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా వ్యవహరించారు. నిఖిల్ దర్శకత్వం వహించాడు. వీకెండ్ లో కామెడీ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునేవారు చౌర్యపాఠం పై ఒక లుక్కేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ఓవర్సీస్ ఆడియెన్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరికీ ఫ్రీగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్.. కానీ..
some critics have found the content to be somewhat weak or predictable, while appreciating the film’s production values, I personally love ❣️ the movie. Especially it’s theme & Screenplay of the movie.. the end, Chaurya Paatam feels like apromising Start & Good interval & Story. pic.twitter.com/87JXsnEchH
— STat. Advait Akash Shah (@advait_akash) May 15, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








