Indian Idol: ఆహా ఇండియన్ ఐడల్ షోలో ఆస్కార్ విజేతల సందడి.. విజేతకు స్పెషల్ గిఫ్ట్ ప్రకటించిన చంద్రబోస్
తాజాగా ఆస్కార్ విజేత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇండియన్ ఐడల్ షోకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నాటు నాటు సాంగ్‌ను అద్భుతంగా ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ తాజా ఎపిసోడ్‌లో సందడి చేశారు.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమవుతోన్న ఇండియన్ ఐడల్ షో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. యువ సంగీత కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మంచి వేదికగా నిలిచిందీ సింగింగ్ ట్యాలెంట్ షో. ఇప్పటికే తొలి సీజన్ సక్సెస్‌ఫుల్‌గా ముగియగా.. ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోన్న రెండో సీజన్‌కు కూడా విశేష ఆదరణ లభిస్తోంది. శ్రేయఘోషల్, జీవి ప్రకాశ్ కుమార్ లాంటి ఫేమస్ సింగర్లు ఇండియన్ ఐడల్ షోలో పార్టిసిపేట్ చేస్తున్న గాయకులపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆస్కార్ విజేత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ఇండియన్ ఐడల్ షోకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు నాటు నాటు సాంగ్‌ను అద్భుతంగా ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ తాజా ఎపిసోడ్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా యువ గాయనీ, గాయకులను ఉద్దేశించి స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇచ్చారు చంద్రబోస్. అలాగే ఈ ఎపిసోడ్‌లో విజేతగా నిలిచిన వారికి ఒక బంపరాఫర్‌ను ప్రకటించారు ఆస్కార్ విజేత. ‘సంగీతమే నా ప్రాణం. నా తర్వాతి తరం సంగీత విద్వాంసులు తెలుగు సంగీతాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు చంద్రబోస్.
ఇదిలా ఉంటే యువ సంగీత కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఈ ఎపిసోడ్ విజేతలకు ఒక అద్భుతమైన గిఫ్ట్‌ను ప్రకటించారు చంద్రబోస్. ఈ ఎపిసోడ్‌లో విజేతగా నిలిచిన వారికి ‘నాటు నాటు’ పాట లిరిక్స్ రాసిన తన పెన్నును బహుమతిగా అందిస్తామన్నారు. ‘ఈ ఎపిసోడ్‌లో విజేతగా నిలిచిన వారికి నాటు నాటు పాట లిరిక్స్ కోసం నేను ఉపయోగించిన పెన్నును గిఫ్ట్‌గా ఇస్తాను. ఇది యువ సంగీత కళాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని భావిస్తున్నాను. అలాగే సంగీతంపై వారి అభిరుచిని కొనసాగించడానికి మరింత ప్రోత్సహిస్తుందని నేను ఆశిస్తున్నాను’ అని చంద్రబోస్ చెప్పారు.




విశ్వవేదికపై తెలుగు పాటకు సత్కారం.. మున్ముందు మరింత ఖ్యాతికి ఉంటుంది ‘ఆస్కార్ం’ మన ‘నాటు’ పాటలో భాగస్వాములైన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్ లకు ఇదే మా ఆహ్వానం..!!#TeluguIndianIdol2 on April 14 & 15 at 7PM@MusicThaman @singer_karthik @geethasinger @itsvedhem @Rahulsipligunj pic.twitter.com/tbAPs2po0W
— ahavideoin (@ahavideoIN) April 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..