AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌లో హోలీ హంగామా.. రంగు తీసి కొట్టు టాస్క్‌లో ఏకంగా 12 మంది నామినేట్‌..

బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ ఇప్పుడు ఓటీటీ  వేదికగా  నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌లో హోలీ హంగామా.. రంగు తీసి కొట్టు టాస్క్‌లో ఏకంగా 12 మంది నామినేట్‌..
Bigg Boss Telugu Ott
Basha Shek
|

Updated on: Mar 15, 2022 | 6:45 AM

Share

బుల్లితెరపై అతి పెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్‌ ఇప్పుడు ఓటీటీ  వేదికగా  నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. ‘బిగ్‏బాస్ నాన్ స్టాప్’ (Bigg Boss Non Stop) పేరుతో ఏకంగా 24 గంటల పాటు స్ట్రీమింగ్‌ అవుతోంది . గత నెల 26న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ముమైత్‌ఖాన్‌, శ్రీరాపాక ఇప్పటికే హౌస్‌ నుంచి వెళ్లిపోయాగారు. ఇక ఎప్పటిలాగే మూడోవారం నామినేషన్స్ కోసం సోమవారం (మార్చి14) నాటి ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. కాగా హోలీ (Holi) పండగను పురస్కరించుకుని ఈసారి కంటెస్టెంట్లకు ‘కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు’ అని టాస్క్‌ ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరిని చెప్పున నామినేట్ చేస్తూ వాళ్లపై రంగు కొట్టాలి. తేజస్వితో ఈ నామినేషన్‌ టాస్క్‌ మొదలైంది. కాగా తన పక్కనే ఉండి గోతులు తవ్విందంటూ అరియానాని, కుర్చీ టాస్క్‌లో ఇబ్బంది పెట్టాడని చైతూను నామినేట్ చేసింది ఐస్‌క్రీం భామ.

బిగ్‌బాస్‌ చరిత్రలోనే.. కాగా స్రవంతి హమీద, మిత్ర శర్మ ని నామినేట్ చేసింది. ఆర్జే చైతు.. తేజస్విని, మిత్ర శర్మని నామినేట్ చేశాడు. మహేష్ విట్టా.. అజయ్‌, నటరాజ్ మాస్టర్‌ని, అషురెడ్డి మహేష్ విట్టా, మిత్ర శర్మలను నామినేట్ చేశారు. ఇక యాంకర్‌ శివ మొదట నటరాజ్ మాస్టర్‌ని , రెండోదిగా అఖిల్‌ని నామినేట్ చేశాడు . బిందు మాధవి తేజస్విని, అఖిల్‌ని నామినేట్‌ చేయగా, హమీదా.. స్రవంతిని, అజయ్‌ని నామినేట్ చేసింది. అలాగే మొదట అజయ్‌ని, ఆతర్వాత మహేష్ విట్టాని నామినేట్ చేశాడు. నటరాజ్ మాస్టర్.. శివని, బిందు మాధవి ప్రవర్తన నచ్చడం లేదంటూ నామినేట్‌ చేశాడు. ఇక సరయు స్రవంతి, అజయ్‌లను, అనిల్.. మహేష్‌ విట్టా, మిత్ర శర్మలను నామినేట్ చేశారు. అరియానా తేజస్వి,మిత్ర శర్మలను నామినేట్‌ చేసింది. అయితే శివ అన్నా శివ అన్నా అంటూ అతన్నే నామినేట్ చేసి షాక్‌ ఇచ్చింది మిత్ర శర్మ. రెండోదిగా.. చైతుని నామినేట్ చేసింది. ఇక చివరిగా అఖిల్ బాబు.. శివ, ఆర్జే చైతులను నామినేట్ చేశాడు. కాగా మొత్తంగా ఉన్న 15 మందిలో అనిల్, సరయు, అషు తప్పితే మిగిలిన 12 మంది ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో నిలవడం గమనార్హం. ఒకేసారి ఇంతమంది నామినేట్ కావడం ఈ సీజన్‌లోనే కాదు.. మొత్తం బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి కావడం విశేషం.Also Read:Andhra Pradesh: గంజాయి మత్తు కోసం గలీజ్ పనులు.. చివరకు ఏం జరిగిందంటే..!

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Viral Video: పెళ్లి కూతురు అందానికి పెళ్లి కొడుకు ఫిదా.. ఆ మాత్రం రియాక్షన్‌ ఉండాలిగా మరి..!