AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe Shyam: ఓటీటీలోకి రాధేశ్యామ్‌ వచ్చేది అప్పుడే.. డిజిటల్‌ స్క్రీన్‌పై డార్లింగ్ సందడి ఎప్పుడంటే..

Radhe Shyam:ప్రభాస్‌ (Prabhas), పూజాహెగ్డే (Poojahegde) జంటగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్‌. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే....

Radhe Shyam: ఓటీటీలోకి రాధేశ్యామ్‌ వచ్చేది అప్పుడే.. డిజిటల్‌ స్క్రీన్‌పై డార్లింగ్ సందడి ఎప్పుడంటే..
Radhe Shyam Ott
Narender Vaitla
|

Updated on: Mar 14, 2022 | 9:25 PM

Share

Radhe Shyam:ప్రభాస్‌ (Prabhas), పూజాహెగ్డే (Poojahegde) జంటగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్‌. కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా క్లాస్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే మాస్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం ఈ సినిమాకు మైనస్‌ అంటూ చర్చ జరిగింది. యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్‌గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. జ్యోతిష్యానికి, ప్రేమకు ముడి పెడుతూ తెరకెక్కిన ఈ కథ ప్రేక్షకులను మరో కొత్త లోకానికి తీసుకెళ్లింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విడుదలపై చర్చ మొదలైంది. రాధేశ్యామ్‌ డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసకున్నట్లు మొదటి నుంచే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారీ మొత్తానికి అమెజాన్‌ డిజిల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఇక రాధేశ్యామ్‌ ఓటీటీలో ఎప్పుడు రానుందన్న దానిపై ఓ చర్చ నడుస్తోంది. సినిమా విడుదలైన 4 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల కావాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

ఈ లెక్కన చూస్తే రాధేశ్యామ్‌ ఏప్రిల్‌ 11 తర్వాత ఓటీటీలో విడుదల కావాల్సి ఉంది. అయితే అంతకు ముందే ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉంది. ఈ కారణంగానే రాధేశ్యామ్‌ చిత్రాన్ని ఏప్రిల్‌ 2 మధ్యాహ్నం 12 గంటల నుంచి స్ట్రీమింగ్‌ మొదలు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

Also Read: Viral Video: పాపం ఇమ్రాన్ ఖాన్.. పాకిస్తాన్ ప్రధానిని ఓ రేంజ్‌లో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు..

Andhra Pradesh: చేతబడి నెపం ఓ నిండు ప్రాణాన్ని చిదిమేసింది.. వీళ్ళు మారరుగాక మారరు..

The Kashmir Files: మోడీ మెచ్చిన చిన్న సినిమా.. ఇప్పుడు ఏకంగా కొత్త చరిత్రనే సృష్టిస్తోందిగా..