Andhra Pradesh: చేతబడి నెపం ఓ నిండు ప్రాణాన్ని చిదిమేసింది.. వీళ్ళు మారరుగాక మారరు..
Andhra Pradesh Crime News: సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్షాన్ని తాకుతున్నా ఏజన్సీవాసులు మాత్రం మూఢ నమ్మకాలు వీడడం లేదు. చేతబడి బాణామతి(Banamathi )అంటూ మూఢ నమ్మకాలతో ఒకరిపై దాడులకు తెగబడుతున్నారు..
Andhra Pradesh Crime News: సాంకేతిక పరిజ్ఞానం అంతరిక్షాన్ని తాకుతున్నా ఏజన్సీవాసులు మాత్రం మూఢ నమ్మకాలు వీడడం లేదు. చేతబడి బాణామతి(Banamathi )అంటూ మూఢ నమ్మకాలతో ఒకరిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా తూర్పు మన్యంలో ఇదే తరహా దారుణం జరిగింది. చేతబడి నెపంతో అక్క తమ్ముడిపై కత్తులతో దాడి చేశారు గ్రామస్తులు. తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం(Etapaka mandal ) రామగోపాలపురం(Ramagopalapuram) లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనలో అక్క సొందే గోపమ్మ అక్కడికక్కడే మృతి చెందగా తమ్ముడు కొరసా రామ్మూర్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. దింతో హుటాహుటిన బంధువులు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నాడు.
తూర్పు గోదావరి జిల్లా ఎటపాక మండలం రామగోపాలపురం లో ఓకుటుంభంలో వరుస మరణాలు సంభవిస్తుండడంతో భూత వైద్యుడిని ఆశ్రయించగా గ్రామానికి చెందిన సొందే గోపమ్మ, కొరసా రామ్మూర్తి నే వారు తమకు చేతబడి చేస్తున్నారని చెప్పడంతో వీరిపై ఈ ఘాటుకాని వొడికట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యకు పాల్పడ్డ చవలం రాజేష్, చవలం గంగరాజు అనే ఇద్దరు వ్యక్తులు కూడా దగ్గర బంధువులే కావడం కొసమెరుపు. నిత్యం ప్రతి అవసరానికీ కలసికట్టుగా ఉండే గిరిజన సాంప్రదాయం మూఢ నమ్మకాలతో మసకబారుతోంది. హత్యకు పాల్పడ్డ రాజేష్ కి చెందిన అత్త, మావయ్యలు రెండు రోజుల గదువులో మృతి చెందడం, గంగరాజు కుటుంబంలో ఇద్దరు పిల్లలు గతంలో మృతి చెందడాన్ని తట్టుకోలేక కక్ష సాధింపు చర్యగా తమ దగ్గర బంధువైనా ఆలోచించకుండా సొందే గోపమ్మ, కొరసా రామ్మూర్తి అనే ఇద్దరు వృద్ధులపై కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్క సొందే గోపమ్మ అక్కడికక్కడే మృతి చెందగా తమ్ముడు కొరసా రామ్మూర్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు రామ్మూర్తిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన ఎటపాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Reporter : Satya, Tv9 Telugu, East godavari
Also Read: Hyderabad: హలీమ్ ప్రియులకు గుడ్ న్యూస్.. మూడు వారాలకు ముందే సరికొత్త టెస్టుతో వచ్చేసిందోచ్..
Telangana: పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?