Bigg Boss Non Stop: ఊహించని ఎలిమినేషన్స్‌తో ఆసక్తిగా బిగ్ బాస్ ఓటీటీ.. ఈవారం నామినేషన్ అయ్యింది ఎవరంటే..
మొన్నటి వరకు బుల్లితెరపై కొన్నిగంటలు మాత్రమే అలరించిన బిగ్ బాస్ ఇప్పుడు 24 గంటలు అలరిస్తూ.. దూసుకుపోతోంది.
Bigg Boss Non Stop: మొన్నటి వరకు బుల్లితెరపై కొన్నిగంటలు మాత్రమే అలరించిన బిగ్ బాస్ ఇప్పుడు 24 గంటలు అలరిస్తూ.. దూసుకుపోతోంది. బిగ్ బాస్ ఓటీటీ అనగానే ప్రేక్షకుల్లోనూ ఒక క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటికకీ అదే ఆసక్తి కొనసాగుతోంది ఈ గేమ్ షో. ఇక మొదటివారంలో హౌస్ నుంచి ముమైత్ ఎలిమినేట్ కాగా.. రెండోవారం ఎలిమినేషన్ లో వర్మ హీరోయిన్ శ్రీరాపాక ఎలిమినేట్ అయ్యింది. ఇక మూడో వారంలో ఎవరు ఊహించని విధంగా ఆర్జే చైతు ఎలిమినేట్ అయ్యాడు. గత వారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరగడంతో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టేశారు. ఆర్జే చైతు ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఉన్నవాళ్లు అంతా షాక్ కు గురయ్యారు.
సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ షురూ చేశారు బిగ్ బాస్. ఈసారి లారీ, హారన్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా.. ఒక హార్న్‌ని హౌస్‌లో పెట్టి.. బిగ్ బాస్ బజర్ మోగించిన ప్రతిసారి హౌస్‌లో ఉన్న వాళ్లు కిందమీద పడి దాన్ని దక్కించుకోవాలని బిగ్ బాస్ చెప్పారు. ఇందులో భాగంగా ఎవరైతే బజర్ మోగినప్పుడు హారన్ మోగిస్తారో.. వారికి ముందుగా నామినేట్ చేసే ఛాన్స్ వస్తుందని చెప్పారు. ముందుగా హారన్ మోగించినవారికి ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది. అందరూ ఊహించినట్లుగానే ఈసారి కూడా యాంకర్ శివకు ఎక్కువ మంది ఓట్లు వేశారు. నటరాజ్ మాస్టర్.. ఆ హార్న్‌ని దక్కించుకున్నాడు. అతనికి హార్న్ దొరికింది అంటే ఎవర్ని నామినేట్ చేస్తాడో చెప్పాల్సిన పనిలేదు. బిందు మాధవి, యాంకర్ శివలను నామినేట్ చేశాడు. రెండోసారి నటరాజ్ మాస్టర్‌కే హార్న్ దొరకడంతో.. మళ్లీ శివని నామినేట్ చేసి అతనితో పాటు రికమండేషన్ కంటెస్టెంట్‌గా పేరొందిన మిత్రాశర్మని నామినేట్ చేశాడు. మహేష్ విట్టా హార్న్ దక్కించుకున్నాడు. దీంతో మహేష్.. అషురెడ్డి, అరియానా ఇద్దర్నీ సెలెక్ట్ చేసి పంపించాడు. బిందు మాదవి శివ ఎంత క్లోజ్ అయినా.. అతడిలో నెగెటివ్ పాయింట్స్ చెప్పి. అతడిని నామినేట్ చేసింది. అలానే అఖిల్ కూడా శివని టార్గెట్ చేశారు. అరియానా సరయుపై చేసిన బాడీ షేమింగ్ ఇష్యూ తెరపైకి వచ్చింది. ఇంట్లో ఉన్న వాళ్లు అరియానా చేసింది తప్పని చెప్పని ఎక్కువ మంది చెప్పడంతో అరియానా నామినేట్ అయ్యి అషురెడ్డి సేవ్ అయ్యింది. అరియనా వైబ్ డిస్టర్బ్ అయిందంటూ సరయుని నామినేట్ చేసింది. దీంతో సరయు.. అరియానా ఎలా ఆడుతుందో అర్థమైదంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక మహేష్ విట్టా తనను నామినేట్ చేయడంతో విసిగిపోయిన అరియనా.. తాను అసలు బాడీ షేమింగ్ చేయలేదంటూ చెప్పింది. సభ్యులు యాంకర్ శివ, బిందుమాధవి, అనిల్, అజయ్, సరయు, అరియానా, మిత్ర శర్మ ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు.
మరిన్ని ఇక్కడ చదవండి :