Miral OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులకు మతిపోవాల్సిందే .. ఎక్కడ చూడొచ్చంటే?

శుక్రవారం వచ్చిదంటే చాలు.. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలేవి వచ్చాయని తెగ వెతుకుతుంటారు మూవీ లవర్స్. ముఖ్యంగా థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ లిస్ట్ ను జల్లెడ పడతారు. అలా ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో మిరల్ అనే తమిళ్ డబ్బింగ్ మూవీ కూడా ఉంది.

Miral OTT: ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. ట్విస్టులకు మతిపోవాల్సిందే .. ఎక్కడ చూడొచ్చంటే?
Miral Movie
Follow us

|

Updated on: Jun 07, 2024 | 12:53 PM

శుక్రవారం వచ్చిదంటే చాలు.. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలేవి వచ్చాయని తెగ వెతుకుతుంటారు మూవీ లవర్స్. ముఖ్యంగా థియేటర్లకు వెళ్లలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ లిస్ట్ ను జల్లెడ పడతారు. అలా ఈ వారం కూడా పలు కొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అందులో మిరల్ అనే తమిళ్ డబ్బింగ్ మూవీ కూడా ఉంది. ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన భరత్ ఇందులో హీరోగా నటించాడు. వాణీ భోజన్ కథానాయికగా నటించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా 2022 నవంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కేవలం తమిళ్ లో మాత్రమే రిలీజైంది. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లనే సాధించింది. కానీ కొన్ని కారణాలతో తెలుగు వెర్షన్ రిలీజ్ కు నోచుకోలేదు.   సుమారు రెండున్నరేళ్ల తర్వాత అంటే మే 17న  మిరల్ తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. అయితే ఇక్కడి ఆడియెన్స్ ఆదరణ నోచుకోలేకపోయింది. శ్రీమతి. జగన్మోహిని అండ్ జీ ఢిల్లీ బాబు సమర్ఫణలో తెలుగులో మిరల్ సినిమాను రిలీజ్ చేశారు. ఎలక్షన్లు, ఐపీఎల్ ఫీవర్ ఉండడం, ప్రమోషన్లు లేకపోవడంతో ఈ సినిమా ఎంత వేగంగా థియేటర్లలోకి వచ్చిందో అంతే వేగంగా వెళ్లిపోయింది.  అయితే ఇప్పుడీ క్రైమ్ సస్పెన్స్  థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో మిరల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది ఆహా ఓటీటీ సంస్థ. ఈ మేరకు ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఎం శక్తివేల్ దర్శకత్వం తెరకెక్కించిన మిరల్ సినిమాలో డైరెక్టర్ కే.ఎస్. రవి కుమార్, మీరా కృష్ణన్, రాజ్ కుమార్, కావ్య అరివుమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సీహెచ్ సతీష్ కుమార్ మిరల్ సినిమాను నిర్మిచారు. ప్రసాద్ ఎస్ ఎన్ సంగీతాన్ని అందించారు. సురేష్ బాలా సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు. ఎడిటర్‌గా కలైవానన్ ఆర్ వ్యవహరించారు. మరి థియేటర్లలో మిరల్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఈ వీకెండ్ లో ఇంట్లో కూర్చొని చూడడానికి ఈ మూవీ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆహాలో స్ట్రీమింగ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్