AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Village OTT: ఒళ్లు గగుర్పొడిచేలా ఆర్య ‘ది విలేజ్’ వెబ్ సిరీస్ ట్రైలర్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెట్‌గా మారిపోయాడు కోలీవుడ్‌ హీరో ఆర్య. అల్లు అర్జున్‌ వరుడు సినిమాతో నేరుగా టాలీవుడ్‌ ఆడియెన్స్‌ను కూడా పలకరించాడు. సైజ్‌ జీరో, సార్పట్ట వంటి డబ్బింగ్‌ సినిమాలతోనూ అలరించాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌తో మరోసారి డైరెక్టుగా తెలుగు మూవీలో నటిస్తున్నాడు

The Village OTT: ఒళ్లు గగుర్పొడిచేలా ఆర్య 'ది విలేజ్' వెబ్ సిరీస్ ట్రైలర్‌.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Village Web Series
Basha Shek
|

Updated on: Nov 18, 2023 | 3:01 PM

Share

రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఫేవరెట్‌గా మారిపోయాడు కోలీవుడ్‌ హీరో ఆర్య. అల్లు అర్జున్‌ వరుడు సినిమాతో నేరుగా టాలీవుడ్‌ ఆడియెన్స్‌ను కూడా పలకరించాడు. సైజ్‌ జీరో, సార్పట్ట వంటి డబ్బింగ్‌ సినిమాలతోనూ అలరించాడు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ సైంధవ్‌తో మరోసారి డైరెక్టుగా తెలుగు మూవీలో నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో తనకు క్రేజ్‌ ఉండడంతో తన డబ్బింగ్ సినిమాలన్నీ ఇక్కడ రిలీజ్‌ చేస్తున్నాడీ కోలీవుడ్ హీరో. ఇప్పుడు చాలామంది హీరోల్లాగే ఆర్య కూడా డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టాడు. ది విలేజ్‌ పేరుతో ఓ ఆసక్తికరమైన వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. మిళింద్ రావు తెరకెక్కించిన ఈ హార్రర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌లో దివ్య పిళ్లై హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఆజియా, ఆడుకులం నరేన్, తలైవాసల్ విజయ్, ముత్తుకుమార్, కలై రాణి, జార్జ్ ఎం, జాన్ కొక్కెన్, అర్జున్ చిదంబరం, పూజ, జయ ప్రకాష్, పి.ఎన్ సన్నీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ది విలేజ్‌ సిరీస్‌ నవంబర్‌ 24 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే టీజర్‌ను రిలీజ్‌ చేసి భయపెట్టించిన మేకర్స్‌ తాజాగా ది విలేజ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

హీరోతో పాటు అతని ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారు అడవి మధ్యలో పాడైపోవడంతో ట్రైలర్‌ మొదలవుతుంది. సాయం పక్కనే ఉన్న ఊళ్లోకి వెళ్లడం.. అక్కడ వింత మనుషులు, కొన్ని అతీంద్రీయ శక్తులు ఆర్య భార్య పిల్లలను అపహరిస్తారు. తన కుటుంబ సభ్యులను రక్షించుకోవడానికి ఆర్య చేసే సాహసాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. సిరీస్‌లోని కొన్ని సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. షమిక్ దాస్ గుప్త రచించిన గ్రాఫిక్ నవల ఆధారంగా మిళింద్‌ రావు ది విలేజ్‌ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. మన దేశంలో ఒక గ్రాఫిక్‌ నవల ఆధారంగా రూపొందిన మొట్ట మొదటి వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం. బీఎస్ రాధాకృష్ణన్ స్టూడియో శక్తి బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించాడు. ఓటీటీల్లో హార్రర్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జోనర్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు మంచి ఆదరణ ఉంది. ది విలేజ్‌ ట్రైలర్‌ చూస్తుంటే ఇదే కోవకు చెందినదని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రానా చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్..

ది విలేజ్ ట్రైలర్..

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్