Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shashthi OTT : 75 అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కొద్దిరోజుల క్రితం షష్ఠి అనే తమిళ షార్ట్ ఫిల్మ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. షార్ట్ ఫిల్మ్ అయినా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. గతేడాది 35వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఏకంగా 75 అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. 2023లో 20వ అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీల్లో పాల్గొని 70కి పైగా అవార్డ్స్ గెలుచుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు

Shashthi OTT : 75 అంతర్జాతీయ అవార్డులు గెల్చుకున్న షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Shashthi Shortfilm
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2023 | 3:41 PM

Shashthi movie: చార్టెడ్‌ అకౌంటెంట్‌ తీసిన షార్ట్ ఫిలిం ఏకంగా 75 అవార్డ్స్ గెలుచుకుంది.. ‘షష్టి’ స్ట్రీమింగ్ ఎక్కడంటే.. దక్షిణాది సినిమాల అద్భుతమైన కంటెంట్ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‏ను శాసిస్తోంది. ఇప్పటికే కన్నడ చిత్రాలు కేజీఎఫ్ 2, కాంతార, చార్లీ 777, తెలుగు మూవీస్ ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తీకేయ 2 బాక్సాఫీస్ వద్ద సంచనలం సృష్టించాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు సైతం విమర్శకుల ప్రశంసలు పొందాయి. ఇక కొద్దిరోజుల క్రితం షష్ఠి అనే తమిళ షార్ట్ ఫిల్మ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. షార్ట్ ఫిల్మ్ అయినా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది. గతేడాది 35వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఏకంగా 75 అవార్డ్స్ గెలుచుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతుంది. 2023లో 20వ అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీల్లో పాల్గొని 70కి పైగా అవార్డ్స్ గెలుచుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు యాపిల్ టీవీ అనే ఓటీటీ యాప్ తోపాటు ఇతర యూట్యూబ్ ఛానల్స్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది.

షష్టి లఘు చిత్రానికి జూడ్ పీటర్ డామియన్ దర్శకత్వం వహించారు. జూడ్ మొదట్లో ఫిల్మ్ మేకర్ కాదు. అతను (CA) చార్టర్డ్ అకౌంటెంట్‌గా 30 సంవత్సరాలు పనిచేశారు. చైన్నైలో ఉండే జూడ్‏కు సినిమా నిర్మాణం అంటే ఇష్టం. సినిమాలను తెరకెక్కించాలనే అభిరుచి ఎక్కువగా ఉండేది. దీంతో జూడ్ ఫిల్మ్ డైరెక్షన్‌లో కోర్సు చేశాడు. ఇక ‘షష్టి’ షార్ట్ ఫిల్మ్‌కి కథ, స్క్రీన్‌ప్లే రాయడానికి అతనికి ఏడాది పట్టిందట. అయితే సినిమా షూటింగ్ కేవలం వారంలోనే పూర్తయింది. ఇలాంటి సినిమాలు చేయాలని, అందులో మంచి పాత్రలు కనిపిస్తాయని, సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని జూడ్ గతంలో చెప్పుకొచ్చాడు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కథ..

ఇవి కూడా చదవండి

ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన దేవి అనే మహిళ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆమె తనను తాను ఎంతగా మార్చుకుంది, ఆమె తనను తాను పిల్లల దేవత అయిన షష్ఠితో సమానంగా భావించడం ప్రారంభిస్తుంది. వివిధ పరిస్థితులలో జ్ఞానాన్ని పొందినప్పుడు వ్యక్తి యొక్క దృక్పథం ఎలా మారుతుందో ఈ చిత్రం చూపిస్తుంది. సెమ్మలార్ అన్నమ్, జియోఫ్రీ జేమ్స్, లిస్సీ ఆంటోని, ఎస్కే గాయత్రి మరియు హారిస్ మోసెస్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ , యాపిల్ టీవీ ఓటీటీలో చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.