Chef Mantra Project K : చెఫ్ మంత్ర అంటూ నవ్వులు పూయిస్తున్న సుమ.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 4..

యాంకర్ సుమ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు బుల్లితెరపై ఎన్నో షోస్, అటు మూవీ ఈవెంట్లలో తనదైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఇప్పుడు చెఫ్ మంత్ర అంటూ ఓటీటీ సినీ ప్రియులను అలరిస్తుంది. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K సీజన్ 4 ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

Chef Mantra Project K : చెఫ్ మంత్ర అంటూ నవ్వులు పూయిస్తున్న సుమ.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 4..
Chef Mantra Project K Show

Updated on: Mar 06, 2025 | 7:55 PM

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ చిత్రాలను, వెబ్ సిరీస్ లను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. అలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు టాక్ షోస్ సైతం స్ట్రీమింగ్ చేస్తుంది. ఇక ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అదే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K. యాంకర్ సుమ కనకాల హోస్టింగ్ చేస్తున్న ఈ షో మార్చి 6 నుంచి రాత్రి 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే చెఫ్ మంత్ర సీజన్ 1, 2, 3 టేస్టీ ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ 4 మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ కె అంటే ఏంటీ ? అనే క్యూరియాసిటీని సైతం ప్రేక్షకులలో క్రియేట్ చేస్తుంది. ఈ షోలో యాంకర్ సుమతోపాటు నటుడు జీవన్ కుమార్ సైతం సందడి చేస్తున్నారు.

ఈ షోలో సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్ – అర్జున్, దీపికా రంగరాజు – సమీరా భరద్వాజ్, సుప్రిత- యాదమ్మరాజు, ప్రషు-ధరణి, విష్ణుప్రియా-పృథ్వీ జోడీలు రుచికరమైన వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ షోలో తెలుగింటి వంటలతోపాటు సర్ ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 4లో అందించనుంది. ప్రస్తుతం ఈ సీజన్ 4 తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..