AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Indian Idol – Aha OTT: : టాలెంటెడ్ సింగర్స్ కోసం ఆహా సరికొత్త ప్రయత్నం.. ఇండియన్ ఐడల్ ఇక పై తెలుగులో..

తొలి తెలుగు ఓటీటీ సంస్థగా ప్రారంభమైన ఆహా సంచలనం సృష్టి్స్తోంది. సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్, అదిరిపోయే

Telugu Indian Idol - Aha OTT: : టాలెంటెడ్ సింగర్స్ కోసం ఆహా సరికొత్త ప్రయత్నం.. ఇండియన్ ఐడల్ ఇక పై తెలుగులో..
Telugu Indian Idol
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2021 | 8:32 PM

Share

తొలి తెలుగు ఓటీటీ సంస్థగా ప్రారంభమైన ఆహా సంచలనం సృష్టిస్తోంది. సూపర్ హిట్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్, అదిరిపోయే టాక్ షోలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. ప్రతి వారం సరికొత్త కంటెంట్ అప్లోడ్ చేయడమే కాకుండా.. ఇతర భాషల్లోని సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతుంది ఆహా. ఇక ఇటీవల నందమూరి బాలకృష్ణతో అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఆహా. ప్రారంభమైన కొద్ది నెలల్లోనే ఏకంగా 11 మిలియన్ల డౌన్ లోడ్స్ తో ఆహా టాప్ గేర్‏లో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. నార్త్ ఇండియాలో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది ఆహా.

ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు ఆహా స్టూడియోస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆహా స్టూడియో ద్వారా వెబ్ సిరీస్ నిర్మించనుంది. ఇక ఇప్పుడు ఓటీటీ సంస్థ ఆహా.. దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించే కార్యక్రమం ఇండియన్ ఐడల్ తెలుగులోకి తీసుకురానుంది. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఊర్రూతలూగించే ఈ షో ఇక పై తెలుగులో రానుంది. ఇండియన్ ఐడల్ సింగింగ్ షోను తెలుగులో ప్రారంభించనుంది ఆహా. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. అలాగే తెలుగు ఇండియన్ ఐడల్ అడిషన్స్ వివరాలు డిసెంబర్ 15న ప్రకటించిననున్నట్లు ఆహా సంస్థ ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు జీవిత కథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్‌ను బాలీవుడ్ నిర్మాత ప్రకాష్ ఝా తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ తెలుగులో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఓటీటీ ప్లాట్‎ఫామ్ ఆహా(Aha OTT)లో ప్రసారం కానుంది.

Also Read: Maa Committee: మా కమిటీలోకి కొత్త సభ్యులు.. రాజీనామా చేసినవారు కూడా మా సభ్యులే.. మంచు విష్ణు కామెంట్స్ వైరల్..

Radhe shyam: ‘సంచారి’ గా చక్కర్లు కొడుతున్న డార్లింగ్.. రాధేశ్యామ్ నుంచి సాంగ్ టీజర్..

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్‌ బాబుకు సర్జరీ.. దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్న హీరో..

Netflix Subscription Plans 2021: ధరలు తగ్గించిన నెట్‌ఫ్లిక్స్.. ‘హ్యాపీ న్యూ ప్రైస్’తో చవకైన ప్లాన్స్.. ఎంతో తెలుసా?