Anjali: వేశ్య పాత్రలో అంజలి.. బహిష్కరణ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

వకీల్ సాబ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలతో అలరించిన అంజలి.. ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో కనిపించింది. ఈ మూవీ వేశ్య పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో అంజలి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.

Anjali: వేశ్య పాత్రలో అంజలి.. బహిష్కరణ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Anjali
Follow us

|

Updated on: Jul 05, 2024 | 8:51 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అంజలి. కథానాయికగా.. ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. వైవిధ్యమైన పాత్రలలో తన నటనతో మెప్పించిన అంజలి… ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుంటుంది. ఎలాంటి పాత్రలలోనైనా జీవించేస్తుంది. వకీల్ సాబ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి చిత్రాలతో అలరించిన అంజలి.. ఇటీవలే మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో కనిపించింది. ఈ మూవీ వేశ్య పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందులో అంజలి నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరోసారి వేశ్వ పాత్రలో అలరించేందుకు రెడీ అయ్యింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అంజలి.. ఇప్పుడు మరోసారి వేశ్య పాత్రలో అడియన్స్ ముందుకు రాబోతుంది. అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ బహిష్కరణ. విభిన్నమైన విలేజ్ రివేంజ్ డ్రామా జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పిక్సెస్ పిక్చర్స్ ఇండియా బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది అంజలి.

ఈ సినిమాలో పుష్ప పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందని.. అమాయకపు వేశ్య నుంచి సమాజంలో అసమానతలను ఎదుర్కొనే స్త్రీ ప్రయాణం అద్భుతంగా ఉంటుందని అన్నారు. పుష్ప అంటే ఓ మిస్టరీ అని.. ఇందులో ఆమె చేసిన ప్రయాణం వచ్చిన మార్పుని చూడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ వెబ్ సిరీస్ లో రవీంద్ర విజయ్, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.