71st National Film Awards: నేషనల్ అవార్డుకు ఎంపికైన సినిమాలు.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర ప్రకటించింది. శుక్రవారం (ఆగస్టు 01) ప్రకటించిన ఈ పురస్కారాల్లో తెలుగు సినిమాలకు సంబంధించి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. మరి వీటితో పాటు జాతీయ అవార్డులకు ఎంపికైన సినిమాలో ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసుకుందాం రండి.

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ఈసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి మొత్తం ఏడు అవార్డులు దక్కాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన హనుమాన్ రెండు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీతో పాటు ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ ఈ మూవీకి అవార్డులు వరించాయి. ఇక బలగం సినిమాకు ఉత్తమ సాహిత్యం విభాగంలో అవార్డు లభించింది. ఇందులో ఊరు పల్లెటూరు అనే పాటకు లిరిక్స్ అందించిన కాసర్ల శ్యామ్‌కు ఈ అవార్డు దక్కింది. ఇక సాయి రాజేశ్ డైరెక్షన్‌లో వచ్చిన ప్రేమకథా చిత్రం బేబీకి రెండు అవార్డులు దక్కడం విశేషం. ఉత్తమ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు సాయి రాజేశ్‌ను జాతీయ అవార్డు వరించింది. అలాగే ఇదే సినిమాలోని ప్రేమిస్తున్నా’ పాట పాడిన పీవీఎన్‌ఎస్ రోహిత్‌కు ఉత్తమ సింగర్ అవార్డ్ దక్కింది. ఇక చివరిగా సుకుమార్ కూతురు నటించిన గాంధీతాత చెట్టు చిత్రానికి గానూ ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి బండ్రెడ్డి జాతీయ అవార్డుకు ఎంపికైంది.
తెలుగు సినిమాలు ఏయే ఓటీటీల్లో ఉన్నాయంటే?
- భగవంత్ కేసరి- అమెజాన్ ప్రైమ్ వీడియో
- బలగం సినిమా- అమెజాన్ ప్రైమ్ వీడియో
- హనుమాన్ మూవీ- జీ5
- బేబీ సినిమా- ఆహా ఓటీటీలో
- గాంధీ తాత చెట్టు- అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్
Truly honoured to be part of this journey 🙌 Our Heartfelt congratulations to the teams of #BhagavanthKesari and #Balagam on winning at the 71st National Film Awards 👏❤️🔥
Content & Promotional Partners: @MangoMassMedia #NationalFilmAwards #NationalAwards2025 #TeluguFilmNagar pic.twitter.com/u3R6pfL9eW
— Telugu FilmNagar (@telugufilmnagar) August 1, 2025
ఇవి కూడా..
- జవాన్ (హిందీ సినిమా) – నెట్ ఫ్లిక్స్
- 12th ఫెయిల్ (హిందీ సినిమా)-జియో హాట్‌స్టార్
- పార్కింగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జియో హాట్‌స్టార్
- ది కేరళ స్టోరీ (తెలుగు డబ్బింగ్ సినిమా)- జీ5
- సామ్ బహదూర్ (హిందీ సినిమా) – జీ5
- ఆత్మపాంప్లెట్ (మరాఠీ మూవీ)- జీ5
- సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ సినిమా) – జీ5
- 2018 (తెలుగు డబ్బింగ్ సినిమా) – సోనీ లివ్
- పూక్కళం (మలయాళ సినిమా) – జియో హాట్ స్టార్
- వశ్(గుజరాతీ సినిమా)- షెమారోమీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








