ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్, టాక్ షోస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఒరిజినల్ చిత్రాలు, సిరీస్ లతో ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తోన్న ఆహా.. ఇప్పుడు మరోసారి సినీప్రియులను 100 శాతం అలరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఆహాలో సూపర్ హిట్ అయిన 3 రోజెస్ వెబ్ సిరీస్ ఇప్పుడు సెకండ్ సీజన్ వచ్చేస్తోంది. పాయల్ రాజ్ పుత్, పూర్ణ, ఈషా రెబ్బా ప్రధాన పాత్రలలో నటించి త్రీ రోజెస్ వెబ్ సిరీస్ అడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సిరీస్ కు యూత్ కు తెగ అట్రాక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ సీజన్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్.
త్రీ రోజెస్ సెకండ్ సీజన్ వస్తుందని తెలియజేస్తూ… మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేసింది ఆహా. తొలి సీజన్ కు మించి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెబుతునన్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో వైవా హర్ష, ఈషా రెబ్బా కామెడీ మరోసారి అదిరిపోయింది. అలాగే ఈ సిరీస్ లో మరో రెండు కొత్త పాత్రలు రాబోతున్నాయని క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ ఇద్దరు ఎవరనేది తెలియరాలేదు.
అతి త్వరలోనే త్రీ రోజెస్ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. కిరణ్ కారవల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. మరీ నవ్వులు పూయిస్తున్న త్రీ రోజెస్ సెకండ్ సీజన్ టీజర్ మీరు చూశారా..?
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..