AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 13 అవార్డులు గెల్చుకున్న రియల్ క్రైమ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే

నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక అమ్మాయి రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ టాగోర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా 13 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..

OTT Movie: 13 అవార్డులు గెల్చుకున్న రియల్ క్రైమ్ స్టోరీ.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే
OTT Movie
Basha Shek
|

Updated on: Aug 21, 2025 | 8:18 PM

Share

ఈ మధ్యన నిజ జీవితంలో జరుగుతోన్న కొన్ని సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. థియేటర్లతో పాటు ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీనే. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సినిమాకు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ప్రతిష్ఠాత్మక టాగోర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఏకంగా 13 అవార్డులు గెలుచుకోవడం విశేషం. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. అది ఉత్తర కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం. ఒక అనాథ యువతి, తన అమ్మమ్మతో కలిసి జీవిస్తుంటుంది. పొట్ట కూటి కోసం ఒక టీ షాప్‌లో పనిచేస్తుంటుంది. చుట్టు పక్కల వారితో ఎంతో కలివిడిగా ఉండే ఆ అమ్మాయి జీవితం ఒక రాత్రి చిన్నాభిన్నామవుతోంది.  నలుగురు దుర్మార్గులు ఆ అమ్మాయిపై  దారుణంగా అఘాయిత్యానికి పాల్పడుతారు. ఈ ఘటన ఆమెను బాగా కుంగదీస్తుంది. దీనికి తోడు సమాజం నుంచి అవమానాలు ఎదుర్కొంటుంది. దీంతో తన జీవితాన్ని నాశనం చేసిన ఆ నలుగురు దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక పథకాన్ని రచిస్తుంది. అలా తనపై దాడి చేసినవారిని ఒక్కొక్కరినీ గుర్తిస్తూ హతమారుస్తూ ఉంటుంది.

ఇదే క్రమంలో ఒక పవర్ ఫుల్ పోలీసు అధికారి ఈ వరుస హత్యల కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు. ఒక చిన్న క్లూతో ఆ  అమ్మాయిని గుర్తిస్తాడు. అయితే ఆమె ఎందుకు అలా మారిపోయందో, ఈ హత్యలు ఎందుకు చేస్తుందో తెలుసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంటడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు. మరి ఈ ట్విస్ట్‌ ఏమిటి ? అమ్మాయి  ఆ దుర్మార్గులపై ప్రతీకారం ఎలా తీర్చుకుంది ? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

ఈ సినిమా పేరు రుద్రి. బడిగేర్ దేవేంద్ర తెరకెక్కించిన ఈ రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ లో పావన గౌడ, సుధా ప్రసన్న, హరీష్ కట్టిమని, గురునాథ్ చింతామణి, పవన్ పుత్ర, సమీర్ నాగరాద్, దయానంద్ సాగర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడలనుకునేవారికి రుద్రి ఒక బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..