Oscars 2023: RRR టీమ్‌ను ఊరిస్తోన్న ఆస్కార్ అవార్డు.. మరికొన్ని గంటల్లో చరిత్ర సృష్టించబోతున్న నాటు నాటు..!!
All the best RRR: ఒక్క అడుగు దూరం.. మరికొన్నిగంటల సమయం.. మన తెలుగు దనానికి వన్నె తెచ్చే.. గర్వేంచే క్షణం. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఆస్కార్ వేడుక తెలుగు ప్రజల్లో ఉత్కంఠ రేపుతుంది.
ఒక్క అడుగు దూరం.. మరికొన్నిగంటల సమయం.. మన తెలుగు దనానికి వన్నె తెచ్చే.. గర్వేంచే క్షణం. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఆస్కార్ వేడుక తెలుగు ప్రజల్లో ఉత్కంఠ రేపుతుంది. అస్కార్ కు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచంలోని భిన్న సంస్కృతులు.. అన్ని వయసులవారిని ఆకట్టుకున్న సందర్భం. లిరిక్స్ అర్ధం కాకపోయినా.. నాటునాటు బీట్ ను మాత్రం ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలాడిస్తుంది. మ్యూజిక్ వింటేనే స్టేప్ వేసేలా చేస్తుంది. మంచి సినిమాకు భాషతో పనిలేదనడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓ ఉదాహరణ.
మరోవైపు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రామ్ చరణ్ రోజుకో హాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలను తన ట్విట్టర్ లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో మేం ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమ, అభినందనలు దక్కాయంటూ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మంచి సినిమాకు భాషతో పనిలేదనడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓ ఉదాహరణ అని చెప్పారు. ఇప్పుడు సినిమా గ్లోబల్ అయ్యిందన్నారు. ఇలాంటి సినీ గ్లోబలైజేషన్ సమయంలో నేను సినీ ఇండస్ట్రీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.
ఇదే సందర్భంగా తనకు హాలీవుడ్ పై ఉన్న మమకారాన్ని రామ్ చరణ్ బయటపెట్టారు. తాను హాలీవుడ్‌లో చాలా మంది దర్శకులతో కలిసి పని చేయాలనుకుంటున్నానని .. వారిలో జె. జె. అబ్రమ్స్ ముందుంటారు.. ఆ తర్వాత క్వాంటిన్ టరాన్‌టినో ఉంటారని చెప్పారు. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీస్‌లో ఆయన తెరకెక్కించిన ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ ఒకటని చెప్పారు చరణ్. ఆయన ప్రభావం తనపై చాలా ఉందని తెలిపారు. వారిద్దరు డైరెక్టర్లు వారితో పని చేసే నటులకు సవాలు విసురుతుంటారని చెప్పారు చరణ్.
ఆస్కార్ వేడుకలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ తెలిపారు. మరోవైపు కాస్త టెన్షగా ఉందని చెప్పారు. తాను అభిమానించే తారలంతా ఆ ఈవెంట్‌కు వస్తున్నారు… అక్కడ తాను అభిమానిగా ప్రవర్తిస్తానో, ఓ నటుడిగా ఉంటానో చూడాలన్నారు. టామ్‌క్రూజ్ చాలా గొప్ప వ్యక్తి. ఆస్కార్ అవార్డుకి తమ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి అర్హులు. 27 ఏళ్ల ప్రస్థానం ఆయనదని .. కీరవాణిని సపోర్ట్ చేయడానికి ఓ కుటుంబంలా మేమంతా ఇక్కడకు వచ్చామని చెప్పారు చరణ్.
ఆస్కార్ వేడుకకు సర్వం సిద్ధం..
ఆస్కార్ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. యావత్ ప్రపంచం తలెత్తుకునే వేడుక కోసం రంగాన్ని రెడీ చేస్తున్నారు. అందరి దృష్టీ ఆస్కార్ ప్రోగ్రామ్ మీద ఉంటే, మనవారి దృష్టి మాత్రం ట్రిపుల్ ఆర్ మీద ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ని తీర్చిదిద్దారు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి. విజయేంద్రప్రసాద్ అందించిన కథ ముందు నుంచే జనాల మధ్య ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది.
ప్రీ ఇండిపెండెన్స్ కథ, అందులోనూ ఇద్దరు చారిత్రక పురుషులకు సంబంధించిన కాల్పనిక కథతో తెరకెక్కిన చిత్రం ట్రిపుల్ ఆర్. గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాను అంతే ఘనంగా రిజీవ్ చేసుకున్నారు ఆడియన్స్. ఇండియాలో వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఐదు ఉంటే, అందులో ఒకటి ట్రిపుల్ ఆర్.
రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇంటా బయటా ఈ సినిమాకు అవార్డుల పంట పండుతుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించింది. దేశానికి గర్వకారణంగా నిలిచిన రాజమౌళి సినిమా.. ఆస్కార్ రేసులో సగర్వంగా నిలిచింది. ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకుంది ట్రిపుల్ ఆర్.
హాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా భావించే HCA అవార్డుల్లో 5 కేటగిరిలలో అవార్డులు సంపాదించి సత్తా చూపించింది ఈ సినిమా. బెస్ట్ వాయిస్ ఫర్ మోషన్ క్యాప్చర్ ఫిలిం కేటగిరిలో ఫస్ట్ అవార్డు అందుకున్నారు రాజమౌళి. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలింగా క్రెడిట్ దక్కించుకుంది ట్రిపుల్ ఆర్. విజయేంద్రప్రసాద్ అందించిన కథ, ఎన్టీఆర్, చరణ్ నటన, రాజమౌళి దర్శకత్వం వహించిన తీరు, సినిమాను తెరకెక్కించిన విధానం ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ని ఫిదా చేశాయి.
ట్రిపుల్ ఆర్ సినిమాను చూసిన వారందరికీ మళ్లీ మళ్లీ గుర్తుకొచ్చేవి యాక్షన్ సీన్స్. పులిని తరుముతూ అడవిలో తారక్ పరుగులు తీసిన తీరు నుంచి, క్లైమాక్స్ లో తారక్, చరణ్ చేసిన యాక్షన్ వరకూ ప్రతిదీ స్పెషలే. మరీ ముఖ్యంగా వన్యమృగాలతో బ్రిటిష్ కోటలో తెరకెక్కించిన నీరు-నిప్పు ఫైట్ సీక్వెన్స్ ఇప్పటికీ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. అందుకే HCA బెస్ట్ యాక్షన్ మూవీ కేటగిరీలోనూ, బెస్ట్ స్టంట్స్ కేటగిరీలోనూ అవార్డు తెచ్చుకుంది ట్రిపుల్ ఆర్. నాటు నాటు పాటకు బెస్ట్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించింది HCA. కీరవాణి ట్యూన్‌కి, చంద్రబోస్ సాహిత్యానికి మరోసారి ఘనమైన గుర్తింపు దక్కింది.
గోల్డెన్ గ్లోబ్ వచ్చిన సినిమాలకు తప్పకుండా ఆస్కార్ వస్తుందనే మాట పదే పదే వినిపిస్తోంది. అయితే ఆల్రెడీ గోల్డెన్ గ్లోబ్, హెచ్‌సీఏ అవార్డులు అందుకున్న ట్రిపుల్ ఆర్‌కి ఇప్పుడు ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు దక్కాలన్నదే అందరి ఆకాంక్ష. ఆల్రెడీ సినిమా ప్రమోషన్ల కోసం మక్కా ఆఫ్ మూవీస్‌లో ల్యాండ్ అయ్యారు తారక్ అండ్ చెర్రీ. ఇద్దరు హీరోలు కలిసి ఇండియన్ సినిమాను సగర్వంగా ఆస్కార్ ముందు నిలిపే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలు చదవండి..