‘మహర్షి’ రెండో సాంగ్ విడుదల
హైదరాబాద్:సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలోని సెకండ్ సింగిల్ నువ్వే సమస్తం లిరికల్ సాంగ్‌ను తాజాగా మూవీ టీం రిలీజ్ చేసింది. ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..’ అంటూ సాగే ఈ పాటకు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ‘ది ఔరా ఆఫ్ రిషి’ పేరుతో ఈ పాటను విడుదల చేశారు. శ్రీమణి లిరిక్స్ సాంగ్ కు హైలైట్ గా నిలిచాయి. బిజినెస్‌మ్యాన్‌లా మహేశ్ హెలికాప్టర్ నుంచి దిగి స్టైల్‌గా […]

హైదరాబాద్:సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమాలోని సెకండ్ సింగిల్ నువ్వే సమస్తం లిరికల్ సాంగ్‌ను తాజాగా మూవీ టీం రిలీజ్ చేసింది. ‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం..’ అంటూ సాగే ఈ పాటకు మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ‘ది ఔరా ఆఫ్ రిషి’ పేరుతో ఈ పాటను విడుదల చేశారు. శ్రీమణి లిరిక్స్ సాంగ్ కు హైలైట్ గా నిలిచాయి. బిజినెస్‌మ్యాన్‌లా మహేశ్ హెలికాప్టర్ నుంచి దిగి స్టైల్‌గా నడుచుకుంటూ రావడం వీడియోలో హైలైట్‌గా నిలిచింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, ప్రకాశ్‌రాజ్, పోసాని, రావు రమేశ్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వినీ దత్, ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఫ్లాన్ చేస్తున్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ అంచనాలు క్రియేట్ చేయండంతో ఆడియెన్స్ సినిమా కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.




