నితిన్ భీష్మకు ఏమైంది..!

‘శ్రీనివాస కల్యాణం’ తరువాత ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నితిన్. దీనికి ‘భీష్మ’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌పై నితిన్ ఇంకా క్లారిటీకి రానున్నట్లు తెలుస్తోంది. హోలీ సందర్భంగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఒక ప్రకటనను చేశాడు నితిన్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తాను […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:16 am, Fri, 22 March 19
నితిన్ భీష్మకు ఏమైంది..!

‘శ్రీనివాస కల్యాణం’ తరువాత ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నితిన్. దీనికి ‘భీష్మ’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్‌పై నితిన్ ఇంకా క్లారిటీకి రానున్నట్లు తెలుస్తోంది.

హోలీ సందర్భంగా తన తదుపరి చిత్రానికి సంబంధించిన ఒక ప్రకటనను చేశాడు నితిన్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తాను నటించబోతున్నానని, ఏప్రిల్ మధ్య నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని నితిన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ‘భీష్మ’ టాపిక్‌ను నితిన్ తీసుకురాలేదు. దీంతో ‘భీష్మ’ ఉన్నాట్లా..? లేనట్లా..? అని అందరిలో అనుమానాలు మొదయ్యాయి. అయితే వెంకీ కుడుముల స్క్రిప్ట్‌పై నితిన్‌కు ఇంకా అనుమానాలు ఉన్నాయని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టాడని తెలుస్తోంది. అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వచ్చినా.. దానిపై కూడా అతడు క్లారిటీని ఇవ్వలేదు. చూడాలి మరి తన తదుపరి ప్రాజెక్ట్‌లను ఈ నెలాఖరులోగా ప్రకటిస్తానని చెప్పిన నితిన్, భీష్మపై ఎలా స్పందిస్తారో.