రవితేజ సరసన ఆ ఇద్దరు

రవితేజ సరసన ఆ ఇద్దరు

కోలీవుడ్‌లో విజయం సాధించిన ‘తెరి’ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రవితేజ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాజల్, కేథరిన్‌ను ఈ రీమేక్ కోసం ఫైనల్ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 22, 2019 | 12:48 PM

కోలీవుడ్‌లో విజయం సాధించిన ‘తెరి’ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రవితేజ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్లు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

కాజల్, కేథరిన్‌ను ఈ రీమేక్ కోసం ఫైనల్ చేశారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే రానా హీరోగా వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో మరోసారి ఈ ఇద్దరు కనిపించనున్నారు. అయితే ‘తెరి’ స్క్రిప్ట్ పరంగా ఈ ఇద్దరు కలిసి ఒక్క సీన్‌లో కూడా కనిపించే అవకాశాలు ఉండవు. కాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu