‘అమ్మోరు’, ‘అందాలరాముడు’ వంటి సినిమాలలో నటించిన సీనియర్ నటి వడివుక్కరసి ఇంట్లో చోరి జరిగింది. చెన్నైలోని టీనగర్, రమాన్ వీధిలో నివాసం ఉంటోన్న వడివుక్కరసి అదే వీధిలో ఉన్న తన కుమార్తె ఇంటికి పది రోజుల క్రితం వెళ్లారు. బుధవారం ఇంటికి తిరిగిరాగా తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో తన ఇంట్లో చోరి జరిగినట్లు వడివుక్కరసి గుర్తించింది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉంది. అందులో దాదాపు 8సవర్ల బంగారాన్ని దొంగలు తీసుకెళ్లారని, వాటి విలువ రూ.2లక్షలు ఉంటుందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.