AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాస్పిటల్‌లో చేరిన విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హాస్పిటల్‌లో చేరాడు. హోలీ హాలీడేను ఆయన ఆసుపత్రిలో గడిపేశాడు. ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, తన సినిమా షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు విజయ్. కాగా విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రంలోనూ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా ఆయన కష్టపడుతున్నారు. దీంతో బుధవారం విజయ్‌కు నీరసంతో కూడిన జ్వరం వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో […]

హాస్పిటల్‌లో చేరిన విజయ్ దేవరకొండ
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 22, 2019 | 10:57 AM

Share

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హాస్పిటల్‌లో చేరాడు. హోలీ హాలీడేను ఆయన ఆసుపత్రిలో గడిపేశాడు. ఇప్పుడు అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండగా, తన సినిమా షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు విజయ్.

కాగా విజయ్ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రంలోనూ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల కోసం పగలు, రాత్రి తేడా లేకుండా ఆయన కష్టపడుతున్నారు. దీంతో బుధవారం విజయ్‌కు నీరసంతో కూడిన జ్వరం వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్సను తీసుకున్నారు. ఇక ఈ రోజు తన మూవీ షూటింగ్‌లలో తిరిగి పాల్గొననున్నారు విజయ్. కాగా ‘డియర్ కామ్రేడ్’ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Follow Us