AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు

గత మూడు రోజుల నుంచి వానలు పడుతున్నాయి. ఇక రెండు రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరి, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసారో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 11, 2026 | 3:37 PM

Share
గత మూడు రోజుల నుంచి వానలు పడుతున్నాయి. ఇక రెండు రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. .ఈ రోజు కర్ణాటక, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరిలోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలు,  బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి.
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరి, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసారో ఇక్కడ చూద్దాం.

గత మూడు రోజుల నుంచి వానలు పడుతున్నాయి. ఇక రెండు రోజుల క్రితం అయితే భారీగా వర్షాలు పడుతున్నాయి. .ఈ రోజు కర్ణాటక, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడు, పుదుచ్చేరిలోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించాయి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మరి, వాతావరణ శాఖ అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేసారో ఇక్కడ చూద్దాం.

1 / 5
రాబోయే మూడు రోజులలో మధ్య అరేబియా సముద్రం మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమ మధ్య,  వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్  బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింతగా విస్తరించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.

2 / 5
పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు మధ్య అరేబియా సముద్రం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ కొంకణ్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర అంతర్గత కర్ణాటక, తెలంగాణ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉన్న  ఉపరితల ఆవర్తనం గుండా ఒక ద్రోణి విస్తరించి ఉంది.

3 / 5

సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు దాని పరిసర ప్రాంతాల మీదుగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఉత్తర ప్రదేశ్ నుండి విదర్భ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో తూర్పు ఉత్తర ప్రదేశ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి ఛత్తీస్‌గఢ్ మరియు తూర్పు మధ్యప్రదేశ్ గుండా విదర్భ వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడింది.మధ్య బంగాళాఖాతం నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు అంతర్గత కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు ఉన్న ద్రోణి  ఈరోజు బలహీనపడింది.

4 / 5
రాబోయే మూడు రోజులకు వాతావరణం ఎలా ఉంటుందంటే? ఈరోజు,రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలోని  కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  రాష్ట్రంలో  గరిష్ట ఉష్ణోగ్రతలు  రానున్న మూడు రోజులలో పెద్దగా మార్పు లేదు. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో గంటకు  40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

5 / 5
Follow Us