పెళ్లయ్యాక బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయానన్న యంగ్ హీరో నితిన్..

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

పెళ్లయ్యాక బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయానన్న యంగ్  హీరో నితిన్..
Nithin
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 21, 2021 | 3:00 PM

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లంచ్ కార్యక్రమంలో కర్నూల్ లో జరిగింది. ఈ సందర్భంగా నితిన్  మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నితిన్ మాట్లాడుతూ ..”క‌ర్నూలు రావ‌డం నాకిదే ఫ‌స్ట్ టైమ్‌. క‌ర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్క‌డ తీసిన సినిమాలు హిట్ట‌య్యాయి. ఆ ప్లేసెంత ప‌వ‌ర్‌ఫుల్లో మీరింకా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్‌కు చాలా ఊళ్ల‌కు వెళ్లాను. అక్క‌డ అంద‌రి ఎన‌ర్జీ చాలా బావుంట‌ది. కానీ మీ ఎన‌ర్జీ దానికంటే ఓ లెవ‌ల్ ఎక్కువ ఉంది. మీ ప్రేమ‌, ఆద‌ర‌ణ చాలా చాలా బావుంది. మార్చి 26 సినిమా వ‌స్తోంది. ప్యూర్ ల‌వ్ స్టోరీ. మామూలుగా రాయ‌ల‌సీమ అంటే ఉట్టి మాస్‌, ఫ్యాక్ష‌న్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ల‌వ్ ఎక్కువ ఉంది. అందుకే ఫ‌స్ట్ ఈ ఈవెంట్‌ను ఇక్క‌డ పెట్టాం. ఇదే ప్రేమ‌తో సినిమా చూసి, మాకు హిట్టివ్వండి.” అన్నాడు. ఇదిలా ఉంటే అంత‌కు ముందు ఓ  అభిమాని నితిన్‌ను “పెళ్ల‌య్యాక స‌న్న‌బ‌డ్డారు కార‌ణ‌మేంటి?” అన‌డిగితే, “ఇంట్లో ప‌నిచేసి, బ‌ట్ట‌లుతికి, అంట్లుతోమి బ‌క్క‌గా అయిపోయాను.” అని నితిన్ చ‌మ‌త్క‌రించాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Aranya Movie : ఏనుగులను కాపాడటానికి రంగంలోకి రానా.. ఘనంగా అరణ్య ప్రీరిలీజ్ ఈవెంట్..